Home న్యూస్ హాయ్ నాన్న ప్రీమియర్ షో రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

హాయ్ నాన్న ప్రీమియర్ షో రివ్యూ…..హిట్టా-ఫట్టా!!

0

నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి ఫస్ట్ నుండి కూడా ప్రమోషన్స్ బాగానే జరిగినా కూడా అనుకున్న రేంజ్ లో బజ్ అయితే రాలేదు, ఇలాంటి టైంలో సినిమాకి మౌత్ టాక్ చాలా ముఖ్యంగా మారగా…

ముందుగా ఓవర్సీస్ లో అలాగే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు పడగా అక్కడ నుండి సినిమా కి ఫస్ట్ టాక్ బయటికి రాగా సినిమా కి ఎలాంటి టాక్ ఈ షోల నుండి సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయకున్నా కూడా తల్లికి దూరం అయిన కూతురుని హీరో ఎలా పెంచుతున్నాడు…ఆ జర్నీలోకి…

HI Nanna Movie Premiere Show Review
హీరోయిన్ ఎలా ఎంటర్ అయింది ఆ తర్వాత కథ ఏంటి అన్న కాన్సెప్ట్ తో వచ్చిన హాయ్ నాన్న ఫస్టాఫ్ కథ ఆసక్తిగానే మొదలు అయినా కూడా తర్వాత కొంచం స్లో డౌన్ అయ్యి ఫస్టాఫ్ ఎండ్ వరకు పర్వాలేదు అనిపించేలా సాగుతూ మంచి ఆసక్తిని కలిగించే ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరుగుతాయని…

ఇక సెకెండ్ ఆఫ్ కథ ప్రిడిక్ట్ చేసేలానే సాగినా కూడా చాలా వరకు బెటర్ పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుందని, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ లు సినిమాకి ఆయువు పట్టు అని అంటున్నారు. ఎమోషనల్ రోలర్ కొస్టర్ రైడ్ లా సినిమా అనిపిస్తూ ఆడియన్స్ థియేటర్స్ నుండి బయటికి వచ్చే టప్పుడు ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో…

థియేటర్స్ బయటికి రావడం ఖాయమని అంటున్నారు… ఓవరాల్ గా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమా కి ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో రిపోర్ట్స్ అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఓవర్సీస్ లో క్లాస్ మూవీస్ కి మంచి రెస్పాన్స్ రావడం కామన్, ఇక్కడ కూడా ఇదే రేంజ్ టాక్ ను సినిమా సొంతం చేసుకుంటే ఇక షో షోకి మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here