Home న్యూస్ చిన్న పిల్లల సినిమా…ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!

చిన్న పిల్లల సినిమా…ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!

0

ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఇండస్ట్రీలకు కూడా పెద్దగా హిట్స్ పడటం లేదు….ఇండియాలోనే కాదు ఏకంగా హాలీవుడ్ లో కూడా అనుకున్న రేంజ్ లో హిట్స్ పడటం లేదు రీసెంట్ టైంలో, కొన్ని సినిమాలు మంచి జోరు చూపించినా కూడా ఒకప్పటిలా బిలియన్స్ లో వసూళ్లు అయితే రావడం లేదు. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా…

అక్షరాలా 11,500 కోట్లు….ఇక ఔట్ అనుకుంటే భీభత్సం ఇది!!
ఇన్ సైడ్ ఔట్2(Inside Out 2 Movie) రిలీజ్ అయ్యింది…చిన్న పిల్లల సినిమా నే అయినా కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం…సినిమా కోసం ఆల్ మోస్ట్ 200 మిలియన్ డాలర్స్ బడ్జెట్ పెట్టారు…ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 1600 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా…

చిన్న పిల్లలతో పాటు పెద్దలను కూడా భారీ ఎత్తున థియేటర్స్ కి రప్పిస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది…సినిమా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఏకంగా 155 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది…ఇండియన్ కరెన్సీలో ఏకంగా 1290 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. 

1880 కోట్ల సినిమా ఇది…అయినా ఫ్లాఫ్ అని తేల్చేశారు!!
ఇక ఓవర్సీస్ మార్కెట్ లో సినిమా 140 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకోగా ఇండియన్ కరెన్సీలో 1165 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 295 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేయగా ఇండియన్ కరెన్సీలో సినిమా 2455 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ఓవరాల్ గా ఇండియాలో కూడా పర్వాలేదు అనిపిస్తూ ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది…. చిన్న పిల్లల సినిమానే అయినా కూడా ఊహకందని ఊచకోత కోస్తూ బడ్జెట్ ను ఆల్ రెడీ క్రాస్ చేసేసి 1 బిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం, ఈ సినిమా విజయంతో హాలీవుడ్ మంచి హిట్ ని సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here