Home న్యూస్ తమిళ్ ఇండస్ట్రీ హిట్ PS1 లేపేసిన జైలర్….ఎపిక్ సెన్సేషన్ ఇది!!

తమిళ్ ఇండస్ట్రీ హిట్ PS1 లేపేసిన జైలర్….ఎపిక్ సెన్సేషన్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన తమిళ్ ఇండస్ట్రీ హిట్ పోన్నియన్ సెల్వన్1(Ponniyan Selvan1) సినిమా తెలుగు లో ఒక్క చోట నిరాశ పరిచినా కానీ అన్ని చోట్లా ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా తమిళనాడులో ఆల్ టైం రికార్డులను సృష్టించింది…

వరల్డ్ వైడ్ గా అలాగే తెలుగు రాష్ట్రాల్లో అంతకన్నా ముందు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విక్రం మూవీ కలెక్షన్స్ ని క్రాస్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసిన పోన్నియన్ సెల్వన్1 సినిమా నెలకొల్పిన కలెక్షన్స్ రికార్డును ఇప్పుడు కేవలం 11 రోజుల్లో ఆడుతూ పాడుతూ…

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) బ్రేక్ చేసి సంచలన రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి. టోటల్ రన్ పోన్నియన్ సెల్వన్1 సినిమా వరల్డ్ వైడ్ గా 487.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…

ఇప్పుడు 11 రోజుల్లో జైలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 505.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…భారీ బడ్జెట్ తో భారీ లెవల్ లో తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్1 సినిమా…

భారీ వసూళ్ళతో దుమ్ము లేపగా జైలర్ మూవీ మీద అంచనాలు ఉన్నప్పటికీ మరీ ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తుందని అంచనా మాత్రం ఎవ్వరికీ లేదనే చెప్పాలి. ఇక జైలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…

Jailer Movie 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here