Home న్యూస్ ఇది మరో 1000 కోట్ల సినిమా….జవాన్ ప్రివ్యూ కుమ్మింది సామి!!

ఇది మరో 1000 కోట్ల సినిమా….జవాన్ ప్రివ్యూ కుమ్మింది సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 8 ఏళ్ళు హిట్ కోసం ఎదురు చూసిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఈ ఇయర్ స్టార్టింగ్ లో పఠాన్(Pathaan) సినిమాతో ఊహకందని కంబ్యాక్ ను సొంతం చేసుకోవడమే కాదు ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు అన్నీ కూడా తిరగరాశాడు…

ఆ సినిమా టోటల్ రన్ లో 1000 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని బాలీవుడ్ లో ఎపిక్ రికార్డులను తిరగరాసిన తర్వాత ఇప్పుడు సౌత్ డైరెక్టర్ అట్లీ(Atlee) డైరెక్షన్ లో షారుఖ్ చేస్తున్న కొత్త సినిమా జవాన్(Jawan) ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 7న…

రిలీజ్ కానుండగా సినిమా అఫీషియల్ ప్రివ్యూ అంటూ ఓ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హిందీ, తమిళ్ మరియు తెలుగులో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఇది కూడా పఠాన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా 1000 కోట్ల మార్క్ ని అందుకునే రేంజ్…

ఉన్న సినిమా అని చెబుతున్నారు…. ఓ సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ సమాజంలో జరిగే అన్యాయాల మీద ఎలా పోరాడాడు అన్న కాన్సెప్ట్ తో వస్తున్న జవాన్ మూవీ ట్రైలర్ లో షారుఖ్ హీరోయిజం నెక్స్ట్ లెవల్ లో రచ్చ చేయగా అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో కుమ్మేసింది….

గ్రాండియర్, విజువల్స్, అట్లీ టేకింగ్ అన్నీ ఈ ప్రివ్యూలో హైలెట్ అవ్వగా కచ్చితంగా సినిమా కూడా ఇదే విధంగా మెప్పిస్తే రికార్డులు ఓ రేంజ్ లో షేక్ అవ్వడం ఖాయమని చెప్పాలి. ఇక ట్రైలర్ చివర్లో గుండుతో షారుఖ్ కనిపించిన తీరు డాన్స్ మరింత హైలెట్ గా నిలిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here