హారర్ నేపధ్యంలో వచ్చే సినిమాలలో కంటెంట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ ట్రీట్ మెంట్ ఎంత కొత్తగా ఉంది అన్న దాని పై ఆ సినిమా విజయావకాశాలు ఆధార పడి ఉంటాయి. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమాల్లో మార్చి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు అరడజను ఉండగా అందులో ఒక సినిమా రోజు రోజు కి మెల్లి మెల్లి గా పుంజుకుంటూ ఉన్నంతలో మంచి వసూళ్లు సాధిస్తుంది.
ఆ సినిమా నే జెస్సీ అనే హర్రర్ మూవీ, మనిషి చనిపోయాక దయ్యం అవుతాడా లేదా అనే అన్వేషణ లో ఉన్న ఒక హంటర్ టీం కి ఒక బంగ్లా లో రెండు దయ్యాలు ఉన్నాయని తెలుస్తుంది, ఆ దయ్యాలు ఎవరు ఎందుకు చనిపోయాయి అన్న కథే సినిమా.
కానీ సినిమా ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ ఉంటుంది, 18 ఏళ్ల తరవా ఏజ్ తగ్గుతూ ఉంటుంది, మరి కొన్ని సీన్స్ కూడా ఆకట్టుకోగా అందరు కొత్త వాళ్ళే అయినా సినిమా తక్కువ బడ్జెట్ లోనే తెరకేక్కినా మెల్లి మెల్లి గా మౌత్ టాక్ తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
సినిమా ను రెండు రాష్ట్రాలలో కేవలం 50 థియేటర్స్ కి అటూ ఇటూ గానే రిలీజ్ చేయగా తర్వాత మెల్లి మెల్లి గా పుంజుకున్న సినిమా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో 130 వరకు థియేటర్స్ లో ఆడుతుంది. కాగా సినిమా ను టోటల్ గా 1.5 కోట్ల రేంజ్ లో అమ్మగా ఇప్పటి వరకు సినిమా.
కోటి కి పైగానే షేర్ ని అందుకుందట. ఎలాంటి పబ్లిసిటీ లాంటివి లేకుండా కేవలం మౌత్ టాక్ తో కలెక్షన్స్ ని అందుకుంటూ బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు. మీరు హర్రర్ మూవీస్ ని ఇష్టపడితే ఈ సినిమా ను ఒకసారి చూడొచ్చు.. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
Nice movie