Home న్యూస్ K.G.F రివ్యూ..హీరోయిజం పీక్స్…కానీ మిగిలింది షాక్!!

K.G.F రివ్యూ..హీరోయిజం పీక్స్…కానీ మిగిలింది షాక్!!

0

    అవడానికి కన్నడ సినిమా నే అయినా టీసర్ ట్రైలర్స్ తో టోటల్ ఇండియా ని ఒక ఊపు ఊపిన సినిమా K.G.F… భారీ అంచనాల నడుమ నేడు కన్నడ, తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలలో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ.. ముందుగా స్టొరీ లైన్ విషయానికి వస్తే… నిరు పేదలైన హీరో అమ్మ కి ఒక కోరిక, తన కొడుకు ఎప్పడికైనా బాగా డబ్బు సంపాదించాలి అని.

షారుఖ్ జీరో రివ్యూ…దెబ్బ పడింది కానీ!!

ఆ కోరికని నెరవేర్చడానికి సిద్ధం అయిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదురుకుని తను అనుకున్నది సాధించి మాఫియానే సాధించే స్టేజ్ కి ఎదిగాడు అన్నది అసలు స్టొరీ పాయింట్…ఇలాంటి కథ అని కాదు కానీ ఇలానే వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి మన దగ్గర.

వాటిలో ఛత్రపతి కూడా ఒకటి. ఇక్కడ కూడా అలాంటి కథ తోనే తెరకేక్కినా ఎంచుకున్న బ్యాగ్ డ్రాప్ మాత్రం కోలార్ మైనింగ్ చోటు. అక్కడ హీరో ఎదురుకున్న పరిస్థితులు ఎదిగిన తీరు ని ఎమోషనల్ సన్నివేశాలను దర్శకుడు బాగా చిత్రీకరించాడు.

కానీ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ని కోకొల్లలు గా రాసుకున్న దర్శకుడు సినిమా లో అసలు పాయింట్ ఎంత చిన్నదిగా ఉందొ చూసుకోలేదు. హీరో తన ఎయిమ్ తో దూసుకు పోతున్నా హీరోయిజం చూపిస్తున్నా ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేరు.

కన్నడ హీరో అవ్వడంతో అక్కడ ఆడియన్స్ కి హీరోయిజం బాగా నచ్చే చాన్స్ ఉన్నా, మిగిలిన చోట్ల తొలి పరిచయం అవ్వడంతో హీరోయిజం సీన్స్ కొన్ని సీన్స్ వరకు బాగుంది అనిపిస్తున్నా అవే రిపీట్ అవుతూ ఉంటె బోర్ కొట్టడం మొదలు అవుతుంది.

సినిమా పరిస్థితి కూడా అలాగే జరిగింది, స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీ గా రాసుకుని ఉండాల్సింది. మెయింట్ పాయింట్ అర్ధం అయ్యాక సినిమా లో వచ్చే సీన్స్ చాలా వరకు మన ఆడియన్స్ కి సహనానికి పరీక్ష పెట్టేవి గానే ఉంటాయి అని చెప్పొచ్చు.

కానీ ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు హీరో అండ్ డైరెక్టర్ ని మెచ్చుకోవాల్సిందే. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ అద్బుతంగా అనిపిస్తాయి. సినిమా కి ప్లస్ పాయింట్స్ ఉన్నా మైనస్ లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి. సెకెండ్ ఆఫ్ పూర్తిగా స్లో నరేషన్ తో కూడుకుని ఉంటుంది.

అలాగే యాక్టర్స్ మనకు పరిచయం లేని వారు అవ్వడం పెద్దగా కనెక్ట్ అవ్వలేం…ఓవరాల్ గా థియేటర్స్ నుండి బయటికి వచ్చే సమయంలో పూర్తీ సంతోషంగా మాత్రం ఉండలేం. ఓవరాల్ గా సినిమా మాస్ ఆడియన్స్ కి కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది.

సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…. కొత్త కథలు కావాలి, డిఫెరెంట్ స్టొరీ లతో సినిమాలు చూడాలి అనుకునే వారికి K.G.F జస్ట్ యావరేజ్ గా అనిపిస్తుంది. మాస్ మూవీస్ కోరుకునే వారు ఒకసారి సినిమా ని చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here