శిఖరం ఎక్కిన KGF…ఇదో చారిత్రిక రికార్డ్!

0
172

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన లేటెస్ట్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ లెవల్ లో కలెక్షన్స్ సెన్సేషన్ కి క్రియేట్ చేస్తూ 17 రోజుల్లోనే ఏకంగా 198 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా సినిమా 18 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో మరో అడురైన ఘనతని  సొంతం చేసుకుని మరే కన్నడ సినిమా అందుకోలేని శిఖరం ఎక్కింది.

KGF 17 Days Total Worldwide Collections...Mammoth BlockBuster

18 వ రోజు ఓవరాల్ గా అన్ని చోట్లా కలుపుకుని 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసిన ఈ సినిమా టోటల్ గా 18 రోజుల్లో 205 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని మొట్టమొదటి 200 కోట్ల కన్నడ గ్రాస్ మూవీ గా నిలిచి అల్టిమేట్ రికార్డ్ ను అందుకుంది.

ఇదో చారిత్రిక రికార్డ్ గా చెప్పుకోవాలి. మిగిలిన ఇండస్ట్రీ లతో పోల్చితే కన్నడ ఇండస్ట్రీ మార్కెట్ వాల్యూ 60 నుండి 70 కోట్ల రేంజ్ గ్రాస్ అని అంతా అనుకుంటున్నా సమయంలో అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి అన్ని చోట్లా అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుని ఈ సినిమా చారిత్రిక రికార్డ్ ను అందుకుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!