Home న్యూస్ KGF 50 డేస్ సెంటర్స్…రికార్డ్ బ్రేకింగ్

KGF 50 డేస్ సెంటర్స్…రికార్డ్ బ్రేకింగ్

0

     కన్నడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన ఊచకోత కి 50 రోజులు పూర్తీ అయింది, రిలీజ్ రోజున సినిమా మిశ్రమ స్పందన ని సొంతం చేసుకోగా మాస్ లో మాత్రం విపరీతమైన రిపీట్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని లెవల్ లో కలెక్షన్స్ ఊచకోత ని సృష్టించి టోటల్ రన్ లో మరే కన్నడ సినిమా కూడా అందుకోలేని కలెక్షన్స్ రికార్డులు సృష్టించింది.

సినిమా టోటల్ కలెక్షన్స్(ఇక్కడ క్లిక్ చేయండి) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మొత్తం మీద 50 రోజుల వేడుకని ఎన్ని సెంటర్స్ లో జరుపుకుంది అన్నది ఆసక్తి గా మారగా సినిమా కర్ణాటక ఏరియా లో సుమారు 34 సెంటర్స్ లో 50 రోజుల వేడుకని జరుపుకుంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20 కి పైగా థియేటర్స్ లో సినిమా 50 రోజుల వేడుకని జరుపుకున్నట్లు సమాచారం. ఇక సినిమా తమిళ్ మరియు కేరళ లో మొత్తం మీద 20 థియేటర్స్ లో 50 రోజుల వేడుకని జరుపుకుందని సమాచారం. ఇక హిందీ వర్షన్ కి గాను…

సినిమా 35 నుండి 40 వరకు థియేటర్స్ లో 50 డేస్ ని పూర్తీ చేసుకుందట. టోటల్ ఇండియాలో సినిమా 110 కి అటూ ఇటూ గా సెంటర్స్ లో 50 రోజుల వేడుకని జరుపుకుందని అంటున్నారు. ఇక ఇందులో మొత్తం మీద డైరెక్ట్ మరియు షిఫ్ట్ సెంటర్స్ కూడా కలిపి…

ఉన్నాయని అంటున్నారు. మొదటి పార్ట్ సాధించిన ఊహకందని భీభత్సం తర్వాత ఇప్పుడు రెండో పార్ట్ పై అంచనాలు స్కై హై లెవల్ లో పెరిగి పోయాయి. ఈ ఇయర్ ఎండ్ వరకు వస్తుంది అంటున్న రెండో పార్ట్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే ఊహకందని కలెక్షన్స్ భీభత్సం సృష్టించే అవకాశం ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here