Home న్యూస్ ఒక్కో అప్ డేట్ తో…NTR30 హాలీవుడ్ లెవల్ లో రచ్చ చేస్తుందిగా!!

ఒక్కో అప్ డేట్ తో…NTR30 హాలీవుడ్ లెవల్ లో రచ్చ చేస్తుందిగా!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతూ ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఇయర్ సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా డైరెక్టర్ కొరటాల శివ ఆచార్యతో డిసాస్టర్ అందుకోవడంతో ఈ సినిమా విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నా కానీ ఇప్పుడు ఒక్కో అప్ డేట్ తో సినిమా హాలీవుడ్ లెవల్ లో రచ్చ చేస్తుంది…

సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా అల్టిమేట్ ఫామ్ లో ఉన్న అనిరుద్ ని తీసుకోగా ఆర్ట్ డైరెక్టర్ గా సాబు సిరిల్ ని తీసుకోగా సినిమాలో యాక్షన్ డైరక్టర్ గా హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ని తీసుకోగా ఈయన సాహోకి కూడా యాక్షన్ కోరియోగ్రఫీ చేశాడు.

ఇక ఇప్పుడు సినిమాకి గ్రాఫిక్స్ కోసం మరో హాలీవుడ్ స్పెషలిస్ట్ ను పిలిపించారు. బ్రాడ్ మిన్నించ్ ని గ్రాఫిక్స్ సూపర్ వైజ్ కోసం తీసుకోగా ఈయన ఇది వరకు హాలీవుడ్ లో, ఆక్వామాన్, 300 సిరీస్, బ్యాట్ మాన్, జస్టిస్ లీగ్, సూపర్ మాన్ సిరీస్ ఇలా ప్రఖ్యాత సినిమాలకు పని చేశాడు…

ఇలాంటి టెక్నీషియన్స్ ఇప్పుడు NTR30 సినిమాకి పని చేస్తూ ఉండటంతో సినిమా మీద అంచనాలను ఓ రేంజ్ లో పెరిగి పోతున్నాయి అని చెప్పాలి. ఇంత మంచి స్టార్ కాస్ట్ తో వస్తున్న ఎన్టీఆర్30 ని కొరటాల అనుకున్న విధంగా తెరకెక్కించగలిగితే బాక్స్ ఆఫీస్ రికార్డులు మరో లెవల్ లో ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here