Home న్యూస్ ఇంకా 20 రోజులు ఉంది…ఆల్ రెడీ 1.2 కోట్లు ఔట్…ప్రభాస్ రచ్చ శురూ!!

ఇంకా 20 రోజులు ఉంది…ఆల్ రెడీ 1.2 కోట్లు ఔట్…ప్రభాస్ రచ్చ శురూ!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) మూవీ మరో 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవుతూ ఉంది. సినిమా మీద మంచి క్రేజ్ ఉండగా సలార్(Salaar Movie) లాంటి మాస్ సబ్జెక్ట్ తర్వాత సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో వస్తున్న కల్కి మూవీ…

అన్ని భాషల ఆడియన్స్ ను అలరించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా మీద బజ్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక సినిమా బిజినెస్ కూడా మంచి జోరునే చూపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ కొన్ని చోట్ల ఓపెన్ చేయగా అక్కడ నుండి బుకింగ్స్ రెస్పాన్స్ సూపర్ సాలిడ్ గా కొనసాగుతూ ఉండటం విశేషమని చెప్పాలి.

సుమారు 125 వరకు లోకేషన్స్ లో సినిమా ప్రీ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు…యావరేజ్ గా టికెట్ కాస్ట్ ఇప్పుడు $33 డాలర్స్ దాకా ఉండగా బుకింగ్స్ ఓపెన్ చేసిన సెంటర్స్ లో మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా $150K మార్క్ ని ఆల్ రెడీ దాటేసి ఫుల్ జోష్ తో దూసుకు పోతుందని సమాచారం.

ఆల్ మోస్ట్ 1.2 కోట్లకు పైగా గ్రాస్ రిలీజ్ కి ఇంకా 20 రోజుల ముందుగానే సొంతం చేసుకున్న కల్కి మూవీ ఎలాంటి క్రేజ్ తో రిలీజ్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ ఓపెనింగ్స్ కానే లేదు ఆల్ రెడీ కల్కి మూవీ రచ్చ చేయడం స్టార్ట్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సాలిడ్ గా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here