Home న్యూస్ కల్కి 155…హనుమాన్ 128….టిల్లు స్క్వేర్ 42…మాస్ రికార్డ్ ఇది!

కల్కి 155…హనుమాన్ 128….టిల్లు స్క్వేర్ 42…మాస్ రికార్డ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 ఇయర్ ఫస్టాఫ్ లో టాలీవుడ్ కి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. అనుకున్న రేంజ్ లో సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఆల్ మోస్ట్ 3 నెలల అన్ సీజన్ ఇంపాక్ట్ పడింది. ఎలక్షన్స్, IPL ల ఎఫెక్ట్ అలాగే పెద్ద స్టార్స్ సినిమాలు పోస్ట్ పోన్ అవ్వగా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది వీకెస్ట్ ఫస్టాఫ్ గా చెప్పుకోవచ్చు ఈ ఇయర్ ఫస్టాఫ్ ను…

అదే టైంలో ఈ ఇయర్ ఫస్టాఫ్ లో అనుకున్న రేంజ్ లో హిట్స్ పడక పోయినా కూడా ఓ మూడు సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి అనుకున్న దానికి మించి లాభాలను సొంతం చేసుకుని రచ్చ చేశాయి… ఇయర్ మొదట్లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో విజయాన్ని అందుకున్న…

హనుమాన్ మూవీ మీడియం రేంజ్ మూవీస్ లో ఎపిక్ ప్రాఫిట్స్ ను అందుకుంది. ఇక సమ్మర్ స్టార్టింగ్ లో టిల్లు స్క్వేర్ మూవీ అంచనాలను మించి పోయి భారీ లాభాలను అందుకోగా తర్వాత వచ్చిన అన్ సీజన్ ను తట్టుకుని ఎలాంటి హాలిడేలు లేకుండా రిలీజ్ అయిన…

ప్రభాస్ కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో అల్టిమేట్ లాభాలను అందుకుంది. మొత్తం మీద ఈ మూడు సినిమాల ఓవరాల్ ప్రాఫిట్ లెక్క 325 కోట్ల మమ్మోత్ మార్క్ ని అందుకోవడం విశేషం…టోటల్ రన్ లో హనుమాన్ మూవీ బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 128 కోట్ల మేర లాభాన్ని అందుకోగా…

టిల్లు స్క్వేర్ మూవీ టోటల్ రన్ లో బిజినెస్ మీద 42 కోట్ల మార్క్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… ఇక ఫస్టాఫ్ ఎండ్ టైంలో రిలీజ్ అయిన కల్కి మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో బిజినెస్ మీద ఆల్ మోస్ట్…

155 కోట్ల లోపు ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మమ్మోత్ బిజినెస్ మీద కూడా ఊహకందని లాభాలను సొంతం చేసుకుంది… ఫైనల్ రన్ లో లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఈ మూడు సినిమాలు ఫస్టాఫ్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఊపిరి పోశాయి..ఇక సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ అయ్యే సినిమాల్లో మరిన్ని సినిమాలు ఇలాంటి లాభాలను అందుకోవాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here