లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) రెండేళ్ళ క్రితం వరకు సరైన హిట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా విక్రమ్(Vikram Movie) తో సెన్సేషనల్ కంబ్యాక్ ను దక్కించుకోవడమే కాదు తమిళ్ లో రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ సినిమా కమల్ హాసన్ కి తిరుగు లేని క్రేజ్ ను మళ్ళీ సొంతం అయ్యేలా చేసి…
ఏకంగా ఆగిపోయింది అనుకున్న భారతీయుడు సినిమా సీక్వెల్ ను సైతం తిరిగి మొదలు అయ్యేలా చేసింది…ఆ సినిమా తో పాటు కమల్ హాసన్ ఇప్పుడు మణిరత్నం డైరెక్షన్ లో తగ్ లైఫ్(Thug Life Movie) సినిమా చేస్తూ ఉండగా కొంచం డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు మణిరత్నం కానీ కమల్ హాసన్ కానీ…
టచ్ చేయని కొత్త పాయింట్ తో రూపొందుతున్న సినిమా అని అంటూ ఉండగా ఇతర స్టార్ కాస్ట్ కూడా సాలిడ్ గా ఉన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బిజినెస్ పరంగా జోరు చూపించడం మొదలు పెట్టింది. కాగా రీసెంట్ గా సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకి అమ్మినట్లు ట్రేడ్ లో సమాచారం…
అక్షరాలా 63 కోట్ల మమ్మోత్ రేటుకి సినిమా ఓవర్సీస్ రైట్స్ ను అమ్మారట. ఈ రేంజ్ రేటు అంటే సినిమా మరో లెవల్ లో కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, కమల్ హాసన్ లాస్ట్ మూవీ విక్రం ఓవర్సీస్ లో 126 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోవడం మేజర్ రీజన్ కాగా మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన….
పోన్నియన్ సెల్వన్ 2 మూవీ కూడా 126 కోట్ల రేంజ్ లో ఓవర్సీస్ లో వసూళ్ళని అందుకుంది. అందుకే డైరెక్టర్ అండ్ హీరో ఇద్దరూ ఫామ్ లో ఉండటం తో ఏకంగా 63 కోట్ల రేంజ్ లో రేటుని తగ్ లైఫ్ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో సొంతం చేసుకుంది. సినిమా అక్కడ హిట్ అవ్వాలి అంటే 130 కోట్లకి పైగా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది…