Home న్యూస్ కొత్త సినిమాల నడుమ “క”కి అన్యాయం…ఇలా అయితే ఎలా సామి!!

కొత్త సినిమాల నడుమ “క”కి అన్యాయం…ఇలా అయితే ఎలా సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దీపావళికి భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు చాలానే ఉన్నాయి….తెలుగు నుండి 2 స్ట్రైట్ మూవీస్ రిలీజ్ కానుండగా తమిళ్ నుండి ఒక బిగ్ మూవీ అలాగే కన్నడ నుండి కూడా ఒక బిగ్ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…అన్ని సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గానే…

తెలుగు లో మంచి బజ్ నే సొంతం చేసుకున్నా కూడా ఇప్పుడు ఇతర మూవీస్ తో పోల్చితే కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ క(Ka Movie) కి మాత్రం అన్యాయం జరిగినట్లే తెలుస్తూ ఉంది ఇప్పుడు…మెయిన్ సెంటర్స్ అయిన హైదరాబాదు లాంటి చోట…

లక్కీ భాస్కర్, అమరన్ మరియు బఘీర లాంటి మూవీస్ తో పోల్చితే క మూవీ కి షోల కౌంట్ చాలా తక్కువగా ఓపెన్ చేశారు..దాంతో ప్రీ బుకింగ్స్ ఇప్పటి వరకు జరిగినవి క మూవీ కి చాలా తక్కువగానే ఉండగా ఇతర ఇండస్ట్రీ మూవీస్ తో పోల్చితే మన తెలుగు మూవీకి…

ఇలా తక్కువ థియేటర్స్ షోలు మాత్రమే క మూవీ వి ఇవ్వడంతో స్ట్రైట్ మూవీని కాదని డబ్బింగ్ మూవీస్ కి ఎక్కువ ప్రేయారిటీ ఇవ్వడం సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు…క మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తీసినా కూడా…

ఇతర ఇండస్ట్రీలలో క మూవీ కి అక్కడ లోకల్ మూవీస్ కి పోటి వలన రిలీజ్ కుదరలేదు…కానీ మన తెలుగులో మాత్రం ఇతర మూవీస్ కి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చి స్ట్రైట్ మూవీ కి మాత్రం చాలా తక్కువ స్క్రీన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్యర్యపరిచింది….ఇక సినిమా కి న్యాయం జరగాలి అంటే మౌత్ టాక్ చాలా బెటర్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here