బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి పరుగును వీకెండ్ కే సడెన్ గా ముగించి, తిరిగి పాజిటివ్ టాక్ పవర్ తో రెండో వీకెండ్ నుండి సాలిడ్ గ్రోత్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉన్న టైం లో కరోనా ఎఫెక్ట్ తో పరుగును కంప్లీట్ గా ముగించాల్సి వచ్చిన క్లాస్ మూవీ కనులు కనులను దోచాయంటే సినిమా ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన వన్ ఆఫ్ బెస్ట్…
మూవీస్ లో ఒకటిగా నిలిచే సినిమా అని చెప్పాలి. తెలుగు లో అప్పుడే జోరు అందుకుంటున్న టైం లో పరుగు ఆగిపోయినా కానీ టెలివిజన్ లో బాగా రేటింగ్ లను సొంతం చేసుకున్న ఈ సినిమా ను ముందు కొన్న ఆహా వీడియో వాళ్ళ కి కూడా అల్టిమేట్….
స్టార్ట్ ను అందించి పెట్టింది… ఆహా యాప్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది ఈ సినిమా…. మొత్తం మీద ఆహా యాప్ లో ఈ సినిమా 2.1 మిలియన్ యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం. ఇది నిజంగానే అల్టిమేట్ వ్యూస్ కౌంట్ అని చెప్పొచ్చు.
ఆహా యాప్ వాళ్ళు ఈ సినిమాను కేవలం 1 కోటి కే కొనగా 2.1 మిలియన్ యూనిక్ వ్యూస్ తో దుమ్ము దులిపెసిన ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని ఈ వ్యూస్ ద్వారా అందుకుంది అన్నది అంచనా వేస్తె ఆహా యాప్ ఒక నెల రేటు 50 ని టికెట్ రేటు గా అనుకుంటే 2.1 మిలియన్ వ్యూస్ కి 50 టికెట్ రేటుతో ఏకంగా….
10.5 కోట్ల మేర కలెక్షన్స్ ని సినిమా ఇక్కడ సాధించి ఉండొచ్చు అని అంచనా వేయవచ్చు. ఇది నిజంగానే ఊహకందని వ్యూస్ లెక్కలు అని చెప్పాలి. కోటి తో 10 కోట్లకి పైగా రెవెన్యూ సొంతం అవ్వడం అంటే సినిమా డిజిటల్ రిలీజ్ లో బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా చెప్పుకోవాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు త్వరగా ముగిసినా మిగిలిన రన్ ని యాప్ లో సాలిడ్ గా కొనసాగించింది ఈ సినిమా..