ఇండియన్ సినిమాలలో ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే చిన్న ఇండస్ట్రీనే అయినా కూడా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ మలయాళ ఇండస్ట్రీ…లోకల్ గా మార్కెట్ కొంచం తక్కువ అయినా కూడా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉండగా కంటెంట్ పరంగా ఇతర ఇండస్ట్రీల కన్నా కూడా ఎక్స్ లెంట్ కంటెంట్ తో…
ఎప్పుడూ ముందు నిలిచే మలయాళ ఇండస్ట్రీ వసూళ్ళ పరంగా మాత్రం, బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ తో పోల్చితే మార్కెట్ కొంచం తక్కువే అయినా కూడా రీసెంట్ టైంలో కొన్ని సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి…. 2016 టైంలో సూపర్ స్టార్…
Malayalam Movies 100Cr Gross Films of All Time
మోహన్ లాల్(Mohan Lal) నటించిన పులి మురుగన్(Puli Murugan Movie) ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా తర్వాత కూడా మళ్ళీ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకుంది. ఆ తర్వాత 2023 ఇయర్ లో 2018 మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి…
100 కోట్ల మార్క్ తో పాటు పులి మురుగన్ సినిమాను దాటేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది… ఇక 2024 ఇయర్ లో మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) మూవీ 100 కోట్ల మార్క్ ని అందుకుని నాలుగో 100 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఓవరాల్ గా ఈ 4 సినిమాలు మళయాళ ఇండస్ట్రీ పరంగా 100 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాయి…
ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో ప్రేమలు(Premalu Movie) తెలుగు వర్షన్ లో క్లిక్ అయితే 5వ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే ఇది తక్కువే అయినా కూడా స్టడీగా మార్కెట్ ను పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం, ఇక ఫ్యూచర్ ఇంకా ఎన్ని సినిమాలు 100 కోట్ల మార్క్ ని అందుకుంటాయో చూడాలి.
What about Kerala story