Home న్యూస్ ఈ రికార్డ్ కొట్టే దమ్ము ఇండియన్ సినిమాల్లో ఏ సినిమాకి ఉందో ఇక…200 ఏంటి సామి...

ఈ రికార్డ్ కొట్టే దమ్ము ఇండియన్ సినిమాల్లో ఏ సినిమాకి ఉందో ఇక…200 ఏంటి సామి అసలు!

0

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమా కి కూడా ఇప్పటి వరకు సొంతం కాని క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమాలు కేవలం కొన్ని మాత్ర్రమే ఉన్నాయి. సీక్వెల్స్ విషయం లో ఆ క్రేజ్ ని కంటిన్యూ చేసిన సినిమాలు కూడా కొన్నే, అలాంటి సినిమాల్లో బాహుబలి సిరీస్ తర్వాత ఇండియా మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా మాత్రం KGF చాప్టర్ 2 సినిమా అనే చెప్పాలి. మొదటి పార్ట్ సాధించిన సెన్సేషనల్ విజయం తర్వాత…

రెండో పార్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాటగా సినిమా కోసం అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ జులై 16 నే రిలీజ్ అయ్యి ఉండాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన పోస్ట్ పోన్ అయ్యి….

కొత్త డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా… ఈ ఇయర్ మొదట్లో రిలీజ్ అయిన ఈ సీక్వెల్ అఫీషియల్ టీసర్ ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అన్ని రికార్డుల బెండు తీసి ఆల్ టైం ఎపిక్ రికార్డులను కూడా నమోదు చేయగా వరల్డ్ లోనే హైయెస్ట్ లైక్స్ తో మరో రికార్డ్ ను కూడా సొంతం చేసుకుని…..

ఆల్ టైం ఎపిక్ రికార్డ్ తో దంచికొట్టగా రీసెంట్ గా సినిమా టీసర్ మరో అద్బుతమైన ఫీట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఏకంగా 200 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి ఇండియన్ టీసర్ గా నిలిచి భీభత్సం సృష్టించిన ఈ సినిమా 8.4 మిలియన్స్ కి పైగా లైక్స్ తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో…

దూసుకు పోతూ ఉండటం విశేషం. ఈ రికార్డ్ ను ఫ్యూచర్ లో కూడా కొట్టడం కష్టమే అని చెప్పొచ్చు కానీ ఏవైనా ఎపిక్ సినిమాలకు ఈ రికార్డ్ కొట్టే ఛాన్స్ కొద్ది వరకు ఉంది. మరి ఫ్యూచర్ లో ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఏ సినిమా సొంతం చేసుకుంటుందో అనేది ఆసక్తి కరం అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here