Home గాసిప్స్ తగ్గేది లేదు…ఫస్ట్ మేమే అంటున్న KGF2…కాచుకోండి ఇక!!

తగ్గేది లేదు…ఫస్ట్ మేమే అంటున్న KGF2…కాచుకోండి ఇక!!

0

రెండేళ్ళ క్రితం కన్నడ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన KGF మిగిలిన చోట్ల మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది, టాక్ కూడా పాజిటివ్ గా రాలేదు కానీ సినిమా మాస్ ఆడియన్స్ కి ఓ రేంజ్ లో ఎక్కగా లాంగ్ రన్ లో అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. హిందీ లో 45 కోట్ల నెట్ ని, తెలుగు లో 13 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని….

అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 220 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని కన్నడ మూవీస్ లో ఏ సినిమా కి అందనంత ఎత్తులో నిలిచింది, అలాంటి సినిమా కి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సినిమాల్లో ఇప్పుడు KGF 2 కూడా ఒకటి, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ అక్టోబర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా ఎఫెక్ట్ వలన పోస్ట్ పోన్ అవ్వగా బాలెన్స్ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో క్లారిటీ ఇన్ని రోజులు లేదు.

కానీ రీసెంట్ గా టీం నుండి న్యూస్ రిలీజ్ అయింది, ఈ నెల 26 నుండి బెంగుళూరు లో సినిమా మిగిలిన పార్ట్ షూటింగ్ జరుగుతుందని, ప్రస్తుతం ట్రీట్ మెంట్ కోసం సంజయ్ దత్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చినా నవంబర్ నాటికి ఆయన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి అవుతుందని టీం ఆల్ మోస్ట్ కన్ఫాం చేసింది. దాంతో ఇప్పుడు సినిమా…

మిగిలిన పెద్ద సినిమాల కన్నా ముందే షూటింగ్ లో అడుగు పెడుతున్న సినిమాగా నిలవబోతుంది, దాంతో ఈ అక్టోబర్ రిలీజ్ మిస్ చేసుకున్నా కానీ అన్నీ అనుకున్నట్లు జరిగి పరిస్థితులు ఇయర్ ఎండ్ కి సెట్ అయితే సంక్రాంతి రేసు లో KGF పార్ట్ 2 రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి. మరి ఎం జరుగుతుందో చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here