మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ సంక్రాంతి రేసులో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు రిలీజ్ సజావు గా అయ్యి ఉంటె మరిన్ని అద్బుతాలు సృష్టించేది కానీ అది మిస్ అవ్వడం తో సినిమా ప్రీమియర్ షోలతో రిలీజ్ అప్పటి నుండి నాన స్టాప్ బ్యాటింగ్ తో మాస్ మహారాజ్ మాస్ పవర్ ని చూపెడుతూ దూసుకు పోతుంది…
కాగా సినిమా 5 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు కొత్త సినిమాల తో పోటి పడటంతో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనుకోగా ఆ అంచనాలను మించి 2.17 కోట్ల దాకా షేర్ ని సాధించింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 66L
👉Ceeded: 41L
👉UA: 27L
👉East: 20L
👉West: 16L
👉Guntur: 17.3L
👉Krishna: 15.2L
👉Nellore: 14.2L
AP-TG Total:- 2.17CR (3.45Cr Gross~)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ షేర్స్… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
5 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ షేర్ వివరాలను గమనిస్తే…
👉Nizam: 6.01Cr
👉Ceeded: 3.11Cr
👉UA: 2.08Cr
👉East: 1.50Cr
👉West: 1.24Cr
👉Guntur: 1.47Cr
👉Krishna: 1.13Cr
👉Nellore: 87L
AP-TG Total:- 17.41CR (28.55Cr Gross~)
KA+ROI: 57L Approx
OS: 60L Approx
Total: 18.58Cr(30.90Cr~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో సాధించిన అల్టిమేట్ కలెక్షన్స్ వివరాలు. మొదటి రోజు సాఫీగా రిలీజ్ అయ్యి ఉంటె సినిమా కలెక్షన్స్ కూడా మరో లెవల్ లో ఉండి ఉండేవని అంచనా వేయవచ్చు.
ఇక సినిమా టోటల్ బిజినెస్ 17 కోట్ల రేంజ్ లో ఉండగా 17.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలవగా ప్రస్తుతానికి 1.08 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక 6 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.