బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ లైలా(Laila Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఈ సినిమా కన్నా ముందు వచ్చిన మెకానిక్ రాకీ ఫ్లాఫ్ ఇంపాక్ట్ లైలా సినిమా మీద పడగా…లైలా మూవీ రిలీజ్ అయిన మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా….
ఏ దశలో కూడా కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. రిలీజ్ కి ముందు రోజు జరిగిన బుకింగ్స్ రిలీజ్ రోజున టికెట్ సేల్స్ లెక్కలు ఓవరాల్ గా 30 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా ఓవరాల్ గా లైలా మూవీ..
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ పరంగా 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ షేర్ 1.05 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది..
విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కి, గామి మరియు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలు సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన మెకానిక్ రాకీ ఇప్పుడు లైలా సినిమాలు మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా ఓపెనింగ్స్ రూపంలో చూపించ లేక పోయాయి ఇప్పుడు…
సినిమా ఓవరాల్ గా 9 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 8 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా కెరీర్ లో మంచి జోరు మీద ఉన్న టైంలో విశ్వక్ సేన్ కి బాక్ టు బాక్ శాకిచ్చే ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి అని చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.