బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన రీసెంట్ మూవీస్ లో కొన్ని మంచి మూవీస్ పడ్డాయి. తన మార్కెట్ బాగానే పెరిగినట్లు అనిపించింది కానీ సరైన కథలను ఎంచుకునే విషయంలో రాంగ్ నిర్ణయాలు తీసుకున్న విశ్వక్ సేన్ లాస్ట్ ఇయర్ మెకానిక్ రాకీ సినిమాతో అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా…
ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ లైలా(Laila Movie) తో వచ్చిన విశ్వక్ సేన్ కి ఈ సారి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది….మొదటి రోజే భారీ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఓపెనింగ్స్ పరంగా విశ్వక్ సేన్ కెరీర్ లోనే…
రీసెంట్ టైంలో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోగా తర్వాత టాక్ డిసాస్టర్ లెవల్ లో ఉండటంతో వీకెండ్ లోనే ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసి డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని భారీగా నిరాశ పరిచింది…
ఓవరాల్ గా 5 రోజుల్లో 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న లైలా మూవీ మిగిలిన రెండు రోజుల్లో మరో 6 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. దాంతో మొదటి వారంలో సినిమా 1.81 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెండో వారం ఆల్ మోస్ట్….
80% కి పైగా థియేటర్స్ నుండి సినిమాను తొలిగించారు….ఓవరాల్ గా సినిమా వాల్యూ టార్గెట్ దృశ్యా బడ్జెట్ దృశ్యా చూసుకుంటే, భారీ నష్టాలతో చుక్కలు చూయించింది అని చెప్పాలి… ఇక విశ్వక్ సేన్ కూడా రీసెంట్ గా ఇక నుండి తన సినిమాలు అందరికీ నచ్చేలా తీస్తానని…
ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లాంటివి పెట్టకుండా ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తానని చెప్పాలి. లైలా తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకున్నా అది కొత్త విశ్వక్ సేన్ ని ఆడియన్స్ కి పరిచయం చేసే టర్నింగ్ పాయింట్ గా మారబోతుంది అని చెప్పాలి. మరి ఫ్యూచర్ మూవీస్ తో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.