Home టోటల్ కలెక్షన్స్ నవదీప్ లవ్ మౌళి టోటల్ కలెక్షన్స్….మామూలు దెబ్బ కాదు సామి!!

నవదీప్ లవ్ మౌళి టోటల్ కలెక్షన్స్….మామూలు దెబ్బ కాదు సామి!!

0

చాలా టైం తర్వాత నవదీప్(Navadeep) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ మౌళి(Love Mouli Movie Total WW Collections) సినిమా ట్రైలర్ తోనే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని, యూత్ ని ఎక్కువగా టార్గెట్ చేసి ఈ సినిమా రూపొందింది అనిపించగా మేకర్స్ యూత్ టార్గెట్ ఆడియన్స్ థియేటర్స్ కి భారీగా వస్తారు కలెక్షన్స్ వస్తాయి అని అంచనా వేశారు.

కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కాన్సెప్ట్ ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఏ దశలో కూడా మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా అందుకోలేక పోయింది సినిమా…మొదటి వీకెండ్ లోనే పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో…

కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది…దాంతో టోటల్ రన్ ని చాలా త్వరగానే కంప్లీట్ చేసుకున్న సినిమా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ తో పరుగును కంప్లీట్ చేసుకుంది. టోటల్ రన్ లో సినిమా ఓవరాల్ గా పట్టుమని 50 లక్షల గ్రాస్ ను కూడా అందుకోలేక పోయింది. వర్త్ షేర్ 22-24 లక్షల రేంజ్ లో మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా…

సినిమాకి పెద్దగా బిజినెస్ ఏమి జరగలేదు కానీ సినిమా బడ్జెట్ 6 కోట్లకు పైనే ఉంటుందని అంచనా…ఆ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. టార్గెట్ చేసిన యూత్ ఆడియన్స్ కూడా సినిమాను చూడటానికి పెద్దగా థియేటర్స్ కి రాకపోవడంతో ఈ సినిమాతో హీరోగా కంబ్యాక్ ఇవ్వాలని చూసిన నవదీప్ కి నిరాశనే మిగిలించింది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here