Home న్యూస్ రంగస్థలం రికార్డ్ ఔట్….కొత్త బెంచ్ మార్క్!

రంగస్థలం రికార్డ్ ఔట్….కొత్త బెంచ్ మార్క్!

0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 6 రోజుల్లో 53.66 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా 7 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను కొట్టబోతుంది. రెండు రాష్ట్రాలలో 7 వ రోజు మినిమమ్ 2.4 కోట్లకు పైగా షేర్ కన్ఫాం కాబట్టి…

రంగస్థలం మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ కానుంది. రంగస్థలం మొదటి వారంలో రెండు రాష్ట్రాలలో 58.5 కోట్ల దాకా షేర్ ని అందుకుంది, ఆ రికార్డ్ కి ఎన్టీఆర్ అరవింద సమేత మొదటి వారం లో 58.41 కోట్ల దాకా కలెక్ట్ చేసి క్లోజ్ గా వచ్చింది.

కానీ ఇప్పుడు మహర్షి మాత్రం రంగస్థలం రికార్డ్ ను బ్రేక్ చేసి మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ పరంగా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ తో పాటు కొత్త సినిమాలకు మాత్రం సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతుంది. ఇక అఫీషియల్ 7 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here