12 కోట్లకు అమ్మితే…ఇప్పటి వరకు వచ్చింది తెలిస్తే షాక్!!

0
716

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి, కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో దూసుకు పోతుండగా సినిమా మహేష్ కంచుకోట గా భావించే ఓవర్సీస్ లో మాత్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని సాధిస్తూ అక్కడ నష్టాలు మిగిలించేలా కనిపిస్తుంది. సినిమాను ఒక్క అమెరికా లోనే 12 కోట్ల వరకు అమ్మారు. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…

మినిమం లో మినిమం 2.7 మిలియన్ కి పైగా గ్రాస్ ని ఓవర్సీస్ లో అందుకోవాల్సి ఉంటుంది, కానీ సినిమా ఇప్పటి వరకు అక్కడ సాధించిన కలెక్షన్స్ మాత్రం కేవలం 1.52 మిలియన్ మాత్రమే. చాలా వరకు మహేష్ సినిమాలకు ఇది మొదటి వీకెండ్ లోపే వచ్చే కలెక్షన్స్.

కానీ అవెంజర్స్ దెబ్బ గట్టిగా పడటం తో ఈ సినిమా కి అది భారీ ఎదురుదెబ్బ గా మారింది, ఉన్నంతలో మహేష్ క్రేజ్ తో ఇక్కడి దాకా వచ్చినా కానీ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అంటున్నారు. ఇప్పటి వరకు షేర్ అక్కడ 6.5 కోట్ల కి అటూ ఇటూ గా ఉంటుందని అంచనా… సెకెండ్ వీకెండ్ లో సినిమా తేరుకుని జోరు చూపితే తప్పితే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టమే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!