Home న్యూస్ టికెట్ ముక్క లేదు…రికార్డులు పక్కా!

టికెట్ ముక్క లేదు…రికార్డులు పక్కా!

0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ లేపడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా పై భారీ క్రేజ్ ఉండగా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. దాంతో ఇప్పుడు క్రేజ్ మరింతగా పెరిగి పోయింది, ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని కొన్ని సెలెక్ట్ చేసిన ఏరియాల్లో రీసెంట్ గా మొదలు పెట్టగా రెస్పాన్స్ బాగుంది.

ఇక ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయింది, ముందుగా ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ మరికొన్ని ప్లేసులలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా కొన్ని నిమిషాల్లో 80% వరకు టికెట్ సేల్స్ అవ్వగా కొన్ని గంటల వ్యవధి లోనే సినిమా టికెట్ సేల్స్ అన్ని జరిగిపోయాయు.

దాంతో అక్కడ ప్రీమియర్ షోల తో సాలిడ్ కలెక్షన్స్ రావడం ఖాయంగా మారింది, ఇక సినిమా అమెరికా మరియు మిగిలిన దేశాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోల ను ప్లాన్ చేస్తున్నారట. ఓవర్సీస్ ఎలాగు మహేష్ స్ట్రాంగ్ అడ్డా అవ్వడం తో మహర్షి ప్రీమియర్ షోల నుండే దుమ్ము లేపే చాన్స్ ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here