Home న్యూస్ మహర్షి టీసర్ – 24 గంటల టార్గెట్స్ తెలిస్తే షాక్!

మహర్షి టీసర్ – 24 గంటల టార్గెట్స్ తెలిస్తే షాక్!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అయిన మహర్షి సమ్మర్ కానుక గా ప్రేక్షకుల ముందుకు రావడాని కి సిద్ధం అవుతున్న విషయం తెలి సిందే, కాగా సినిమా అఫీషియల్ టీసర్ ని మరి కొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు, కాగా ఈ టీసర్ కి తొలి 24 గంటల్లో కొన్ని నికార్సయిన టార్గెట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అవి ఏంటి ఏంటో ఒక్కోటి గా తెలుసు కుందాం పదండీ..

ఫాస్టెస్ట్ 1 మిలియన్ వ్యూస్:
ప్రస్తుతానికి ఈ రికార్డ్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా పేరిట ఉంది, ఆ సినిమా కేవలం 29 నిమిషాల్లో నే 1 మిలియన్ వ్యూస్ ని అందుకుంది, రెండో ప్లేస్ లో అరవింద సమేత 30 నిమిషాల రేంజ్ లో 1 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్:
ఈ రికార్డ్ ను అరవింద సమేత అజ్ఞాతవాసి రెండు సినిమాల పేరిట సమానంగా ఉందని చెప్పొచ్చు, రెండు సినిమా కేవలం 30 నిమిషాల వ్యవధి లోనే 1 లక్ష లైక్స్ ని అందుకుని సరికొత్త రికార్డ్ ను నమోదు చేశాయి, ఇక మహర్షి ఈ రికార్డ్ అందుకుంటుందా లేదా అన్నది ఆసక్తి గా మారింది.

24 గంటల హైయెస్ట్ వ్యూస్:
ఈ రికార్డ్ విషయం లో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఓన్ రికార్డ్ తోనే పోటి పడబోతున్నాడు, లాస్ట్ ఇయర్ వచ్చిన భరత్ అనే నేను టీసర్ 24 గంటల్లో 8.67 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని టాప్ లో ఉంది, మహర్షి ఈ రికార్డ్ కొడుతుందా లేదో చూడాలి.

24 గంటల హైయెస్ట్ లైక్స్:
ఇక ఫైనల్ గా 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని అజ్ఞాతవాసి సినిమా టీసర్ 4 లక్షల 12 వేల లైక్స్ తో సాధించి టాప్ లో ఉంది, మహర్షి టీసర్ ముందు ఓవరాల్ గా సాధించాల్సిన 24 గంటల రికార్డులు ఇవి. మరి ఎన్ని కొడుతుందో చూడాలి. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here