8 వ రోజు మళ్ళీ కుమ్మిన చిత్రలహరి…8 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0
390

  2016 లో సుప్రీమ్ సూపర్ డూపర్ హిట్ కొట్టిన సాయి ధరం తేజ్ తర్వాత మూడేళ్ళ దాకా హిట్ కాదు కదా యావరేజ్ కి కూడా నోచుకోలేదు, ఇలాంటి సమయం లో చిత్రలహరి సినిమా తో క్లాస్ హిట్ కొట్టిన సాయి ధరం తేజ్ తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని సంచలన కలెక్షన్స్ తో ఇప్పుడు రెండో వారం లో కూడా జోరు చూపుతూ దూసుకు పోతున్నాడు. చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజున…

మంచి వసూళ్ళ తో హోల్డ్ చేసి కొత్త పాత సినిమాల పోటి ని తట్టుకుని నిలబడింది. సినిమా 8 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర 59 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 8 వ రోజున 66 లక్షల షేర్ ని సాధించింది. దాంతో సినిమా 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 11.8 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా…

వరల్డ్ వైడ్ గా 14.6 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది, దాంతో సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ 13.5 కోట్లకు ఇప్పటికే 1.1 కోట్ల లాభం తో హిట్ నుండి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది, రెండో వీకెండ్ ముగిసే సరికి సినిమా సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది, ఒకవేళ మిస్ అయిన రెండో వారం ముగిసే లోపు సూపర్ హిట్ అనిపించుకుంటుంది చిత్రలహరి సినిమా.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!