బాక్స్ ఆఫీస్ దగ్గర సీనియర్ యాక్టర్ నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ మళ్ళీ పెళ్లి లాస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వగా కాంట్రవర్సీలతో మంచి బజ్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్ డే రోజున కొంచం పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ ను సొంతం చేసుకోగా తొలి రోజు వసూళ్లు కూడా పర్వాలేదు అనిపించేలా సొంతం చేసుకుంది. కానీ తర్వాత మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
హోల్డ్ ని చూపించలేక మొదటి వారానికే ఆల్ మోస్ట్ పరుగును పూర్తీ చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. మొదటి వీకెండ్ లో పడుతూ లేస్తూ డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా మిగిలిన రోజుల్లో…
ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించలేదు. దాంతో మొదటి వారంలో టోటల్ గా 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి తీసుకు రాలేక పోయింది. చిన్న సినిమా అనుకున్నారు కానీ ఆల్ మోస్ట్ 17 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా…
మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక పోయింది. నాన్ థియేట్రికల్ రైట్స్ పర్వాలేదు అనిపించే రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా సినిమాకి భారీ నష్టాలే సొంతం అయ్యాయి అని చెప్పాలి. వర్త్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.6 కోట్లు కాగా సినిమా 1.3 కోట్ల వాల్యూ లాస్ ను సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర.