కింగ్ నాగార్జున 2016 లో సోగ్గాడే చిన్నినాయన మరియు ఊపిరి సినిమాలతో అల్టిమేట్ ఫామ్ కి తిరిగి రాగా తర్వాత చేసిన సినిమాలు నిరాశనే మిగిలించాయి. లాస్ట్ ఇయర్ చేసిన ఆఫీసర్ ఎపిక్ ఇండస్ట్రీ డిసాస్టర్ అవ్వగా నాని తో చేసిన మల్టీస్టారర్ పర్వాలేదు అనిపించుకున్నా సోలో హిట్ ఇంకా దక్కలేదు. ఇలాంటి సమయం లో తన కెరీర్ లో వన్ ఆఫ్ ది క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్న మన్మథుడు సినిమాకి సీక్వెల్ గా మన్మథుడు2 చేస్తున్న విషయం తెలిసిందే.
ఆగస్టు 9 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు కానీ సాటిలైట్ రైట్స్ బిజినెస్ లో మాత్రం ఓ రేంజ్ లో కుమ్మేసింది ఈ సినిమా… స్ట్రీమింగ్ రైట్స్ కింద 7.4 కోట్లు ఇచ్చి నెట్ ఫ్లిక్స్ కొనుక్కోగా, హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 6.1 కోట్లు పలికింది.
ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ కి 8.3 కోట్ల రేటు దక్కింది. మొత్తం మీద శాటిలైట్ రైట్స్ కిందే సినిమాకి 21.8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 20 కోట్లకు పైగా జరగడం ఖాయం… ఏ లెక్కన చూసుకున్నా సినిమా ఓవరాల్ అన్ని కలుపుకుని బిజినెస్ 43 కోట్ల దాకా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.