Home న్యూస్ ఇది కదా మాస్ అంటే…రవితేజ మాస్ జాతర 1st సాంగ్ రివ్యూ!!

ఇది కదా మాస్ అంటే…రవితేజ మాస్ జాతర 1st సాంగ్ రివ్యూ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన రీసెంట్ మూవీస్ అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతూ ఉండగా…ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇప్పుడు రవితేజ చేస్తున్న కొత్త సినిమా మాస్ జాతర(Mass Jathara Movie)…

ముందు సమ్మర్ లో రిలీజ్ అనుకున్నా కూడా ఇప్పుడు జులై లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి ఆల్ రెడీ రిలీజ్ అయిన టీసర్ గ్లిమ్స్ సినిమా మీద సాలిడ్ అంచనాలను పెంచేసింది. ఇక లేటెస్ట్ గా సినిమా నుండి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు…

తూ మేరా లవర్(Tu Mera Lover song) ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…అవ్వడానికి మామూలు పాటే అయినా కూడా రవితేజ కెరీర్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటైన ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి సాంగ్ మ్యూజిక్ ను అలాగే స్వర్గస్తుడైన చక్రి వాయిస్ ను…

AI సహాయంతో మళ్ళీ రీ క్రియేట్ చేసి ఈ సాంగ్ కి వాడారు…దాంతో సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే మంచి క్రేజ్ ఏర్పడగా ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చూపుల్తో గుచ్చి గుచ్చి లిరిక్స్ ను వాడకుండా ఫ్రెష్ సాంగ్ కి కొంచం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను వాడుకోగా…

ఓవరాల్ గా సాంగ్ లో రవితేజ మాస్ లు అండ్ ఇడియట్ ట్యూన్ ని వాడిన తీరు శ్రీలీల డాన్స్ కూడా అన్నీ హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ హియరింగ్ లోనే సాలిడ్ గా ఎక్కేసిన సినిమా థియేటర్స్ లో వింటేజ్ రవితేజ ను గుర్తు చేస్తూ థియేటర్స్ మ్రోత మ్రోగిపోవడం ఖాయమని చెప్పాలి…

ఓవరాల్ గా సాంగ్ సినిమా మీద ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది అని చెప్పాలి. ఇక సినిమా నుండి వచ్చే ఇతర ప్రమోషనల్ కంటెంట్ అండ్ ట్రైలర్ ఇదే రేంజ్ లో క్లిక్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ కి సాలిడ్ కంబ్యాక్ ఖాయమని చెప్పొచ్చు ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here