రీసెంట్ టైంలో వరుస పెట్టి నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) కంబ్యాక్ కి సిద్ధం అయిన లేటెస్ట్ మూవీ మట్కా(Matka Movie Review And Rating) ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు జోరు చూపించాడో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే….కూలి పని చెసుకున హీరో లైఫ్ లో ఎదగాలి అన్న కసి ఉంటుంది…ఈ క్రమంలో ఇల్లీగల్ బిజినెస్ లో దూరిన హీరో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటాడు…ఈ క్రమంలో తనకి శత్రువులు కూడా ఏర్పడతారు…మరి శత్రువులను ఎదిరించిన హీరో తానూ అనుకున్నది సాధించాడా లేదా అన్నది కథ పాయింట్…
ముందుగా కథ పాయింట్ ప్రజెంట్ టైంకి వెరీ బేసిక్ గా అనిపించవచ్చు కానీ సినిమా రన్ అవుతున్న టైం వేరు కాబట్టి అప్పటి పరిస్థితులకు తగ్గట్లు డైరెక్టర్ చాలా వరకు బాగానే మ్యానేజ్ చేశాడు, కానీ ఎంత అప్పటి టైం కథనే అయినా చాలా వరకు ఆడియన్స్ ఊహకు అనుగుణంగానే సినిమా సాగుతుంది…
కానీ బ్యాగ్ డ్రాప్ డిఫెరెంట్ గా ఉండటంతో చాలా వరకు ఆడియన్స్ సినిమాతో ఎంగేజింగ్ గానే ఉంటారు….పెర్ఫార్మెన్స్ పరంగా వరుణ్ తేజ్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. డిఫెరెంట్ గెటప్స్, డిఫెరెంట్ వేరియేషన్లు, డైలాగ్స్ లో మార్పులు ఇలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు…
హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. హీరోయిన్ సాక్షి పర్వాలేదు అనిపించేలా నటించగా ఇతర స్టార్ కాస్ట్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించారు. సంగీతం ఓకే అనిపించినా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ ని బాగానే ఎలివేట్ చేసింది…
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు ఓకే కానీ సెకెండ్ ఆఫ్ కంప్లీట్ గా డ్రాగ్ అయిపొయింది…. సెకెండ్ ఆఫ్ లో కథ స్లో నరేషన్ తో సాగి రిపీట్ సీన్స్ తో ఏమాత్రం ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే చాలా కోట్ల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది… బేసిక్ స్టోరీని డిఫెరెంట్ గా చెప్పాలని ట్రై చేసినా అది ఏమాత్రం సెట్ అవ్వలేదు అనిపించింది….
ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా అప్పటి లొకేషన్స్ కోసం బాగానే ఖర్చు చేసి సెట్స్ వేశారు. ఇక డైరెక్టర్ గాడ్ ఫాదర్ ను ఇన్ స్పైర్ గా తీసుకుని రొటీన్ కథనే డిఫెరెంట్ బ్యాగ్ డ్రాప్ లో చెప్పే ప్రయత్నం చేసినా అది ఆడియన్స్ అంచనాలను అందుకునే విషయంలో చాలా వెనకబడిపోయింది అని చెప్పాలి
కొన్ని సీన్స్ వరకు బాగున్నా కూడా ఓవరాల్ గా వరుణ్ తేజ్ తప్పితే సినిమాలో ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎంత వెతికినా కనిపించలేదు…….ఓవరాల్ గా పెద్దగా ఎక్స్ పెర్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్ళే ఆడియన్స్ కి చాలా ఓపిక పట్టి చూసినా యావరేజ్ లెవల్ లో అనిపించే అవకాశం కొద్ది వరకు ఉంది కానీ చాలా ఓపిక అవసరం….. ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్….