అఖిల్ అక్కినేని నటించిన మొదటి 3 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయాయి… ఫస్ట్ సినిమాకే స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ వచ్చినా ఆ సినిమా రిజల్ట్ గట్టి ఎదురు దెబ్బ కొట్టగా తర్వాత చేసిన సినిమాలు అంచనాలను అందుకోలేక పోయాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా బరిలో నిలిచి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి…
క్లీన్ హిట్ గా నిలిచి ఇప్పుడు అఖిల్ కెరీర్ లో ఫస్ట్ హిట్ గా అండ్ మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాగా నిలవగా ఓవరాల్ గా ఈ సినిమా సాధించిన థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలను గమనిస్తే….
సినిమా ను మొత్తం మీద 28 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించినట్లు సమాచారం. ఇక సినిమా థియేట్రికల్ బిజినెస్ ఓన్ రిలీజ్ కాకుండా 18.5 కోట్లకు జరిగింది. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ ను గమనిస్తే… శాటిలైట్ రైట్స్ కింద 7.2 కోట్ల రేటు ని సొంతం చేసుకుందట ఈ సినిమా. ఇక డిజిటల్ రైట్స్ కింద…
మరో 4 కోట్ల మేర రేటుని సొంతం చేసుకుందట, ఇక సినిమా మ్యూజిక్ రైట్స్ కింద 70 లక్షల దాకా బిజినెస్ చేయగా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 8.5 కోట్ల బిజినెస్ చేయగా ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ కింద 2 కోట్ల మేర బిజినెస్ చేసిందని ట్రేడ్ లో సమాచారం. దాంతో టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు 20.4 కోట్ల బిజినెస్ చేసినట్లు అయింది..
టోటల్ గా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు 38.9 కోట్ల రేంజ్ లో జరిగిందని అంటున్నారు. అంటే బడ్జెట్ మీద సినిమా ఓవరాల్ గా 10.9 కోట్ల మేర లాభాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి. ఇందులో ఆహా అల్లు అరవింద్ దే కాబట్టి ఆ 4 కోట్ల డిజిటల్ రైట్స్ తీసేసినా ఇంకా 6.9 కోట్ల ప్రాఫిట్ వచ్చిందని చెప్పొచ్చు. కెరీర్ లో అంతకుముందు హిట్ లేక పోయినా ఈ రేంజ్ ప్రాఫిట్స్ అంటే గ్రేట్ అనే చెప్పాలి.