మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తర్వాత సైరా కోసం కొంచం ఎక్కువ టైం తీసుకోగా సైరా తర్వాత ఆచార్య కూడా అనుకోకుండా కొంచం ఎక్కువ టైం పరిస్థితుల కారణంగా తీసుకోవాల్సి రాగా ఆచార్య తర్వాత మాత్రం వరుస పెట్టి సినిమాలతో మెగాస్టార్ సూపర్ స్పీడ్ తో దుమ్ము లేపాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్, ఆ తర్వాత భోలా శంకర్, తర్వాత బాబీ డైరెక్షన్ లో….
వాల్తేరు వాసు ఇలా వరుస సినిమాలను కమిట్ అయిన మెగాస్టార్ మరిన్ని కథలను కూడా వింటూ ఉండగా ఇప్పుడు వీటితో పాటు మరో కథని కూడా ఓకే చేశారని తెలుస్తుంది, టాలీవుడ్ లో చేసింది 2 సినిమాలే అయినా రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడం…
కామెడీ పరంగా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకోవడంలో మెప్పించిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ఉండబోతుంది అని ఆల్ మోస్ట్ అఫీషియల్ గా కన్ఫాం అయిపొయింది, ఛలో సినిమా తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి తర్వాత…
భీష్మ సినిమా తో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న వెంకీ కుడుముల ఆ సినిమా తర్వాత కథలను చాలా మంది హీరోలకు వినిపించినా కానీ అప్పటికే చాలామంది బిజీగా ఉండటంతో ఏ ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదు, కానీ అనుకోకుండా మెగాస్టార్ ని కలవడం ఒక కథ వినిపించడం అది చిరు కి చాలా బాగా నచ్చడంతో వెంటనే మెగాస్టార్ స్టొరీ కి…
ఓకే చెప్పగా ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లాంటి అల్టిమేట్ మూవీ తీస్తున్న DVV దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారని అంటున్నారు… మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది లాంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి అని చెప్పాలి. వెంకీ కుడుముల కామెడీ సబ్జెక్ట్ కి చిరు స్టైల్ కామిక్ టైమింగ్ తోడైతే పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఖాయం అనే చెప్పాలి.