అప్పుడప్పుడు కొన్ని సినిమాలు వస్తాయి, ఆడియన్స్ ఒకటి ఎక్స్ పెర్ట్ చేస్తే మరోటి వాళ్ళకి చూపించి మొత్తానికే దెబ్బ పడేలా చేస్తాయి…ఈ కోవ లోకే వస్తుంది రీసెంట్ గా వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హరీష్ శంకర్(Harish Shankar) ల కాంబోలో రూపొందిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) సినిమా….
రిలీజ్ కి ముందు రవితేజకి ఫ్లాఫ్స్ ఉన్నా కూడా కాంబో హైప్, ఒరిజినల్ వర్షన్ సక్సెస్, సూపర్ హిట్ ఆడియో, హీరోయిన్ ఓవర్ నైట్ క్రేజ్ ఇలా అన్నీ ప్లస్ పాయింట్స్ కనిపించడంతో మినిమమ్ గ్యారెంటీ మూవీ ఖాయమని అందరూ అందుకున్నారు…
కట్ చేస్తే మొదటి ఆటకే ఎక్స్ ట్రీమ్ నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా మెప్పించలేక మొదటి వారానికే చేతులు ఎత్తేసి పరుగును కంప్లీట్ చేసుకుంది. ఇక డిజిటల్ లో రిలీజ్ అయిన 4 వారాలకు వచ్చేసిన సినిమాకి ఇక్కడ ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్…
మరింత దారుణంగా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమాలో రవితేజ ఇంట్రో టైంకే రైటర్ బివిఎస్ రవి నేను మగాడిగా పుట్టాను కానీ అమ్మాయిగా పుట్టి ఉంటేనా అంటూ రవితేజ కి ఇచ్చిన ఎలివేషన్ లు ఎంత రోతగా ఉన్నాయో మాటల్లో చెప్పలేం అంటున్నారు. ఇక హీరోయిన్ డబ్బింగ్ కానీ హిందీ ఓల్డ్ సాంగ్స్ కానీ…
పరమ బోర్ కొట్టించగా ఎలాగోలా ఫస్టాఫ్ సత్య కామెడీతో యావరేజ్ గా అనిపించినా సెకెండ్ ఆఫ్ లో ఒక్క సిద్ధూ జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ తప్పితే మిగిలిన సినిమా మొత్తం పరమ రోత పుట్టించింది అంటూ ఓ రేంజ్ లో ట్రోల్స్ పడుతున్నాయి సినిమా మీద…
ఒరిజినల్ ని పూర్తిగా చెడగొట్టిన హరీష్ శంకర్, ఫోకస్ ఎక్కువగా హీరోయిన్ గ్లామర్ మీద కొన్ని ఇతర అంశాల మీద తప్పితే ఇవి ఆడియన్స్ కి నచ్చుతాయో లేవో అని అసలు ఆలోచన కూడా చేయలేక పోయారా అనిపించేలా ఉందంటూ చెబుతున్నారు…ఆగస్టు 15 వీకెండ్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ మరియు డబుల్ ఇస్మార్ట్ సినిమాలు…
ఒకటికి మించి ఒకటి అసలు ఎలా ఒక సినిమాను డైరెక్ట్ చేయకూడదు అన్నదానికి ఉదాహరణలుగా నిలుస్తాయి అని అంటున్నారు… ఈ ఇయర్ వచ్చిన బిగ్ మూవీస్ లో ఇండియన్2 అస్సలు నచ్చని మూవీ అయితే ఈ రెండు సినిమాలు ఆ సినిమాను మించిన సినిమాలు అని అంటున్నారు…ఈ రేంజ్ ఓ ఉంది మిస్టర్ బచ్చన్ కి ఓటిటి లో రెస్పాన్స్…