మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కెరీర్ లో క్రాక్, ధమాకా లాంటి సినిమాలు తప్పితే మిగిలిన సినిమాలు అన్నీ కూడా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి…ఇలాంటి టైంలో మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ కాంబోలో రవితేజ చేసిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie Review Rating) తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే…సిన్సియర్ ఇన్ కం టాక్స్ ఆఫీసర్ అయిన హీరో అనుకోకుండా ఒక రైడ్ తర్వాత సస్పెండ్ అవ్వాల్సి వస్తుంది…ఈ గ్యాప్ లో హీరోయిన్ తో పరిచయం ప్రేమగా మారగా తర్వాత మళ్ళీ సస్పెన్షన్ కాన్సిల్ అయ్యి ఒక పెద్ద బిగ్ షాట్ ఇంట్లో రైడ్ కి హీరో వెళ్ళాల్సి వస్తుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….
ఒరిజినల్ లో ఉన్న కోర్ పాయింట్ ను అలానే తీసుకున్నా కూడా ఆ ఇంటెన్స్ కథకి హరీష్ శంకర్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించగా ఫస్టాఫ్ లో ఎలాగోలా పడుతూ లేస్తూ సాగిన సినిమా ఇంటర్వెల్ నుండి అసలు కథలోకి ఎంటర్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో అసలు కథలో అనవసరపు క్రియేటివిటీ వలన మొదటికే మోసం వచ్చినట్లు అయింది….
ఒరిజినల్ రైడ్ మూవీ సీరియస్ గా సాగే కథ, ఆ కథకి ఫస్టాఫ్ వరకు ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ అలాగే హీరోయిజం ఎలివేట్ అయ్యే ట్రాక్స్ పెట్టి ఎలాగోలా పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో ఇంటెన్స్ కథ చెప్పకుండా ఆ కథలో కూడా అనవసరపు సీన్స్ తో కంప్లీట్ గా కథనే ట్రాక్ తప్పేలా చేశాడు డైరెక్టర్…
ఉన్నంతలో రవితేజ ఫుల్ ఎనర్జీతో రీసెంట్ మూవీస్ లో మిస్ అయిన జోష్ ను చూపించగా, కామెడీ హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో కుమ్మేశాడు… హీరోయిన్ మొదటి సినిమానే అయినా కూడా బాగా మెప్పించింది….జగబపతిబాబు రోల్ ఉన్నంతలో పర్వాలేదు…సో సోగా సాగిన ఫస్టాఫ్ కి సత్య కామెడీ కొంచం రిలీఫ్ ఇచ్చింది…. సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్….అవి సరిగ్గా కుదరకపోయి ఉంటే పరిస్థితి మరింత కష్టంగా ఉండేది….
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నీరసంగా ఉండగా సెకెండ్ ఆఫ్ అయితే మరింత నీరసం తెప్పించింది… ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఇక హరీష్ శంకర్ ఎంచుకున్న పాయింట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇది వరకు రీమేక్ తో పోల్చితే ఈ సారి సెట్ అవ్వలేదు….ఉన్నంతలో ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ సాగి పర్వాలేదు అనిపించినా కూడా…
సెకెండ్ ఆఫ్ కివచ్చేసరికి అనవసరపు కిచిడి అసలుకే ఎసరు తెచ్చింది…ఒరిజినల్ బాగుంటుంది కదా మిస్టర్ బచ్చన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనుకుంటే నిరాశ ఎక్కువ అవ్వడం ఖాయం….డైరెక్టర్ మరీ హైప్ ఇచ్చి చెప్పిన మ్యాటర్ లేనేలేదు…కానీ సాంగ్స్ కోసం, రవితేజ ఎనర్జీ కోసం…కొన్ని పర్వాలేదు అనిపించే సీన్స్ కోసం…కొంచం ఎక్కువ ఓపిక చేసుకుని చూస్తె యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్….