Home న్యూస్ రికార్డుల జాతర సృష్టిస్తున్న మురారి…క్లాస్ సినిమాతో ఇదేం కొట్టుడు సామి!!

రికార్డుల జాతర సృష్టిస్తున్న మురారి…క్లాస్ సినిమాతో ఇదేం కొట్టుడు సామి!!

0
Murari4K Re Release Gross Bookings Crossed 2CR Mark - Record
Murari4K Re Release Gross Bookings Crossed 2CR Mark – Record

టాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం వరకు రీ రిలీజ్ ల ట్రెండ్ సాలిడ్ గా ఉండేది…కానీ రీసెంట్ టైంలో రీ రిలీజ్ లు మరీ ఎక్కువ అయిపోవడంతో జనాలు రీ రిలీజ్ లను కూడా లైట్ తీసుకోవడం మొదలు పెట్టగా కొన్ని మంచి రీ రిలీజ్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయాయి…ఇలాంటి టైంలో…

ఇక రీ రిలీజ్ ల ట్రెండ్ కంప్లీట్ గా అయిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు కానుకగా మహేష్ బాబు నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ అయిన మురారి(Murari 4K Re Release Bookings Report) సినిమాను రిలీజ్ చేస్తూ ఉండగా…

ఈ సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత రీ రిలీజ్ లు పెద్దగా అంచనాలను అందుకోవడం లేని టైంలో ఈ ఓల్డ్ క్లాసిక్ మూవీని జనాలు థియేటర్స్ కి వచ్చి చూస్తారా అన్న అనుమానాలు ఉండగా, ఆ డౌట్స్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ మురారి మూవీ రీ రిలీజ్ అడ్వాన్స్ టికెట్ సేల్స్ ట్రెండ్…

ట్రేడ్ మొత్తాన్ని విస్తుపోయేలా చేస్తుంది. టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో ఒక రోజు బుక్ మై షోలో హైయెస్ట్ టికెట్ సేల్స్ అయిన 40 వేలకు పైగా టికెట్ సేల్స్ తో మాస్ రచ్చ చేసిన మురారి మూవీ రీ రిలీజ్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో…

ఫాస్టెస్ట్ 2 కోట్ల గ్రాస్ బుకింగ్స్ ను దక్కించుకుని సంచలనం సృష్టించింది. సినిమా బాక్స్ ఆఫీస్ రిలీజ్ కి ఇంకా 3 రోజుల టైం ఉండగానే ప్రీ బుకింగ్స్ గ్రాస్ 2 కోట్ల మార్క్ ని దాటేయగా అందులో ఒక్క హైదరాబాదులోనే కోటి మార్క్ ని క్రాస్ చేసి మిగిలిన చోట్ల కూడా…

ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా ఆగిపోయిన రీ రిలీజ్ ట్రెండ్ కి మళ్ళీ ఊపిరి పోస్తూ ఇప్పుడు ఏకంగా రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది. ఇక సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి వసూళ్ళతో ఊచకోత కోస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here