నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీస్ వి ది మూవీ కానీ టక్ జగదీష్ కానీ ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఇండస్ట్రీ నుండి థియేటర్స్ ఓనర్స్ నుండి సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది నానికి… అప్పుడే నాని ఒక మాట చెప్పాడు… ఎట్టి పరిస్థితులలో…
కూడా తన అప్ కమింగ్ మూవీ శ్యామ్ సింగ రాయ్ ని థియేటర్స్ లోనే ఎలాగైనా రిలీజ్ చేసి తీరుతా అని…. కానీ రిలీజ్ టైంకి ఆంధ్రలో పరిస్థితులు అసలు ఏమాత్రం సెట్ కాక పోవడంతో మళ్ళీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తారేమో అన్న డౌట్స్ వచ్చినా నాని మాత్రం సినిమా…
24నే వస్తుందని కన్ఫాం చేసి అదే టైం కి రిలీజ్ చేశాడు. కానీ ఆంధ్రలో పరిస్థితుల వలన బిజినెస్ జరగలేదు… దాంతో చాలా ఏరియాల్లో సినిమాను ఓన్ గా రిలీజ్ చేయగా సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వడంతో తన వల్ల నిర్మాత బాధ పడకూడదు అని సినిమా రెమ్యునరేషన్ లో…
చాలా మొత్తాన్ని నిర్మాతకి రిటర్న్ ఇచ్చి సినిమాను థియేటర్స్ లో ఎలాగైనా రిలీజ్ చేయాల్సిందే అంటూ నిర్ణయం తీసుకున్నారట. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా కోసం నాని 8.5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకోగా సినిమా సజావుగా రిలీజ్ అవ్వడానికి అందులో నుండి ఏకంగా 5 కోట్ల అమౌంట్ ని నిర్మాతకి రిటర్న్ ఇచ్చి సినిమాను థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా…
చేశాడట నాని…. అందువలనే ఆంధ్రలో బిజినెస్ చేయకపోయినా కానీ సినిమాను తక్కువ థియేటర్స్ లో అయినా ఆన్ టైం కి రిలీజ్ చేయగలిగారు. ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పెర్ఫార్మ్ చేస్తున్న కారణంగా లాంగ్ రన్ లో ఇతర బిజినెస్ లతో నిర్మాత సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది, లాభాలు వస్తే అప్పుడు నాని రిటర్న్ ఇచ్చిన అమౌంట్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం…