విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ్ లో ధనుష్ అసురన్ సినిమా తెలుగు రీమేక్ గా రూపొందిన సినిమా నారప్ప, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన పరిస్థితులు మారి డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా, సినిమా కి డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా అల్టిమేట్ మౌత్ టాక్ లభించడం తో సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో…
దూసుకు పోతుంది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటె రోజు సినిమా కలెక్షన్స్ లెక్కలతో సందడి మరో రేంజ్ లో ఉండేది కానీ డిజిటల్ లో రిలీజ్ అవ్వడం తో వ్యూస్ లెక్కలు పెద్దగా బయటికి రావడం లేదు. లేటెస్ట్ గా సినిమా మొదటి వారాన్ని పూర్తీ చేసుకోగా…
ఓవరాల్ గా ఎన్ని వ్యూస్ ని సొంతం చేసుకుని ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా టాలీవుడ్ తరుపునుండి ఈ సినిమా హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను మొదటి వారం లో సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది అంటున్నారు ట్రేడ్ వర్గాలలో… వాళ్ళ లెక్కల ప్రకారం…
సినిమా మొత్తం మీద మొదటి వారానికి గాను ఓవరాల్ గా 28 నుండి 30 మిలియన్ వరకు వ్యూస్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక ఇందులో యూనిక్ వ్యూస్ ఒకే మెయిల్ ఐడి నుండి ఒక వ్యూస్ ని మాత్రమే కౌంట్ లోకి తీసుకుంటే అవి ఒక 5-6 మిలియన్ వ్యూస్ మధ్యలో ఉంటాయని ట్రేడ్ లో అనుకుంటున్నారు. ఇది టాలీవుడ్ తరుపున….
ఏ సినిమా కి అయినా అమెజాన్ ప్రైమ్ లో ఆల్ టైం రికార్డ్ గా చెబుతున్నారు ఇప్పుడు… హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దూసుకుపోతున్న నారప్ప సినిమా పెట్టిన 40 కోట్ల డబ్బు కి ఫుల్ న్యాయం చేసేలా దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయి ఉన్నా సినిమా ఇదే రేంజ్ లో సందడి చేసి ఉండేదని చెప్పొచ్చు.