విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ్ లో ధనుష్ హీరోగా రూపొందిన అసురన్ సినిమా తెలుగు రీమేక్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ నారప్ప, బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ కారణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ రాగా సినిమా కి రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇచ్చిన భారీ రేటు వలన…
సినిమా డిజిటల్ రిలీజ్ ను ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకుంది, రీసెంట్ గా సెన్సార్ పనులను కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జులై 24 న డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది అంటూ జోరుగా ప్రచారం సాగుతుండగా మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
ఇక సినిమా రిలీజ్ ఇప్పుడు సడెన్ గా ఆగిపోబోతుంది అని తెలుస్తుంది, దానికి కారణం రీసెంట్ గా తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదురుకుంటున్న టికెట్ రేట్ ఇష్యూ గురించి త్వరలో చర్చలు జరపబోతున్నామని చెబుతూ అలాగే ఈ ఇయర్ అక్టోబర్ వరకు కూడా…
ఏ సినిమా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం కాకుండా చూసుకోవాలని, అక్టోబర్ వరకు పరిస్థితులు సాధారణ స్థాయి కి రాకుంటే అప్పుడు మీ ఇష్టం అంటూ లేటెస్ట్ గా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న స్ట్రైట్ మూవీస్ లో పెద్ద మూవీ అయిన నారప్ప పై పడబోతుందని అంటున్నారు.
సినిమా రిలీజ్ కి ఇక బ్రేక్ ఆల్ మోస్ట్ పడినట్లే అని అంటున్నారు. త్వరలోనే టీం దీనిపై కూడా స్పందించే అవకాశం ఉంది, డబ్ మూవీస్ విషయం లో ఎలాంటి నిర్ణయం చెప్పలేదు కానీ స్ట్రైట్ మూవీస్ అక్టోబర్ వరకు డైరెక్ట్ రిలీజ్ కాకుండా చూసుకోవాలని చెప్పడం తో త్వరలో డిజిటల్ రిలీజ్ కి ప్లాన్ చేసుకున్న అన్ని సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఇక.