విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ నారప్ప అసురన్ సినిమా కి రీమేక్ గా రూపొందగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ వలన మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి ఇక డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సి వచ్చింది, ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా లో హైలెట్ అనిపించినా టాప్ 5 సీన్స్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండీ…
మొదటి సీన్ నారప్ప పెద్ద కొడుకు జైలులో ఉన్న టైం లో ఊరి పెద్దలు నారప్ప పెద్ద కొడుకు కొట్టిన ఊరి పెద్ద కాళ్ళు మొక్కు అని చెప్పగా ఊరి పెద్ద తన ప్లేస్ లో తన కొడుకుని పెడతాడు.. అయినా కానీ నారప్ప కాళ్ళు మొక్కగా తన బంధువుల కాళ్ళకి కూడా…
మొక్కాలి అంటూ చెప్పగా ప్రతీ ఒక్కరి కాళ్ళ మీద పడతాడు నారప్ప, ఆ టైం లో వెంకీ యాక్టింగ్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద కొడుకు చనిపోయినప్పుడు నారప్ప బాధ నిజంగానే హృదయాలని కలిచి వేస్తుంది. ఈ సీన్స్ లో వెంకీ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్…
ఇక సినిమాలో ఇంటర్వెల్ సెకెండ్ హైలెట్ సీన్, ఇది గూస్ బంప్స్ తెప్పించే సీన్… అప్పటి వరకు నారప్ప అంటే కేవలం గొడవలకు దూరంగా ఉండే చాతకాని తండ్రిగా చూపెట్టి తన చిన్న కొడుకుని కాపాడే టైం లో చూపెట్టిన తీరు రోమాలు నిక్క బోర్చేలా చేస్తుంది… ఆ సీన్ ఇచ్చే హై ఫీలింగ్ అల్టిమేట్ అనే చెప్పాలి.
ఇక ఫ్లాష్ బ్యాక్ తన ఫ్యామిలీ చంపిన వాళ్ళని అందరినీ ఒకే రూమ్ లో నారప్ప నరికి నరికి చంపడం ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ వెంకటేష్ ఎలివేశన్స్ చూస్తున్న ఆడియన్స్ కి అల్టిమేట్ గూస్ బంప్స్ ని తెప్పించే సీన్ అని చెప్పాలి. ఈ సీన్ మొత్తం వెంకీ ఒక ఉగ్ర నరసింహుడిలా అనిపిస్తాడు చూస్తున్న ఆడియన్స్ కి… ఇక ఈ సీన్ తర్వాత సినిమా…
కొంచం స్లో అవుతున్న టైం లో మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లో కొడుకుని కాపాడుకోవడానికి నారప్ప కత్తి పట్టుకుని వచ్చే సీన్ ఆ ఫైట్ లో శత్రువులను చంపే సీన్ కూడా డైరెక్టర్ అద్బుతంగా తీశాడు. ఈ సీన్స్ అన్నింటికీ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ నెస్ట్ లెవల్ లో గూస్ బంప్స్ వచ్చేలా ఎలివేట్ చేస్తే వెంకీ పెర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో అదరగొట్టింది అని చెప్పాలి.
ఇక ఈ సీన్ తర్వాత చివరగా క్లైమాక్స్ లో తన కొడుకుతో మాట్లాడుతూ మన దగ్గర పొలం ఉంటే తీసుకుంటాడు, డబ్బు ఉంటే గుంజుకుంటారు కానీ చదువు ఉంటే తీసుకోలేరు అంటూ నారప్ప చెప్పడం, తర్వాత ఎమోషనల్ గా తన ఫ్యామిలీ ని ఇక చూడడేమో అన్నట్లు స్లో మోషన్ లో కోర్టు లోపలికి వెళుతూ ఇచ్చే స్మైల్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది….
సినిమాలో మిగిలిన సీన్స్ కూడా అక్కడక్కడా మంచి హై ఫీలింగ్ ని ఇచ్చినా కానీ ఈ సీన్స్ మాత్రం చాలా మెప్పించాయి అని చెప్పాలి. మీకు కూడా సినిమాలో ఏవైనా ఇంకా మంచి సీన్స్ మెప్పించినవి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
naarappa high voltage movie. All characters perform well. I like this movie very much. Mostly victory Venkatesh gaaru. Mind blowing. 👏👏👏