బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ లోనే పీక్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ(Akhanda) వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) మరియు రీసెంట్ గా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాలతో ఆడియన్స్ ను మూడు సార్లు మెప్పించగా..
సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యునరేషన్ ని మరింతగా పెంచేశాడు అంటూ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా బజ్ అయితే వినిపిస్తుంది అని చెప్పాలి… బాలయ్య అఖండ ముందు వరకు తీసుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువగానే ఉండగా…
ఇప్పుడు హాట్రిక్ మూవీస్ తో ఆడియన్స్ ను మెప్పించిన బాలయ్య ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ అన్నింటికికీ 20 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని స్ట్రాంగ్ గా టాక్ ఉంది. ఫైనల్ లెక్కలు తేలాల్సి ఉండగా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ మాత్రం కన్ఫాం అని అంటున్నారు…
తన అప్ కమింగ్ మూవీస్ కూడా ఫుల్ ప్రామిసింగ్ గా ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటే కచ్చితంగా బాలయ్య రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది, బాబీతో భారీ యాక్షన్ మూవీ చేస్తున్న నట సింహం బాలయ్య…
ఆ సినిమా కి కూడా భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటూ ఉండగా ఆ తర్వాత సినిమాలకు కూడా ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట…. ఇక హాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య చేయబోయే సినిమాలతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాడు ఎలాంటి కలెక్షన్స్ ను దక్కించుకుంటాడో చూడాలి ఇక…