Home గాసిప్స్ వరుస ఫ్లాఫ్స్….అయినా నాగ చైతన్య లేటెస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే!!

వరుస ఫ్లాఫ్స్….అయినా నాగ చైతన్య లేటెస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే!!

0

టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో మంచి మార్కెట్ ఉన్న నటులలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ఒకరు…కెరీర్ లో ప్రీ కోవిడ్ నుండి మజిలీ, వెంకిమామ, లవ్ స్టొరీ, బంగార్రాజు లాంటి మంచి హిట్స్ ను అందుకున్నా కూడా తర్వాత చేసిన థాంక్ యు మరియు కస్టడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర…

భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. హిందీలో చేసిన లాల్ సింగ్ చడ్డా సినిమా కూడా డిసాస్టర్ అయ్యింది. వరుస ఫ్లాఫ్స్ పడ్డా కూడా నాగ చైతన్య మార్కెట్ ఏమి డౌన్ అవ్వలేదు, ఫ్లాఫ్ మూవీస్ కి కూడా మంచి నాన్ థియేట్రికల్ బిజినెస్ లు జరిగాయి. అలాగే తన అప్ కమింగ్ మూవీస్ కూడా ప్రామిసింగ్ గా ఉండగా…

ముందుగా తండెల్ సినిమాతో ఇయర్ ఎండ్ లో సందడి చేయబోతున్న నాగ చైతన్య వరుస ఫ్లాఫ్స్ లో కూడా మంచి డిమాండ్ మీదే ఉన్నాడని తెలుస్తుంది. తన సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు బాగా జరుగుతూ ఉండటం రెమ్యునరేషన్ విషయంలో ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాడట నాగ చైతన్య…

ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ఒక్కోటికి 8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాగ చైతన్య అప్ కమింగ్ మూవీస్ కి 10 కోట్ల రేంజ్ దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర తండెల్ తో మంచి కంబ్యాక్ ను కనుక సొంతం చేసుకుంటే తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది….

బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు నాగ చైతన్య, ఈ సినిమాలో లవ్ స్టోరీ పెయిర్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తనతో సవ్యసాచి సినిమా తీసిన డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాతో నాగ చైతన్యకి ఎలాంటి సక్సెస్ సొంతం చేస్తాడో అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు. ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here