Home న్యూస్ డిసాస్టర్ తర్వాత మూవీ…కస్టడీ టోటల్ బిజినెస్…టార్గెట్ పెద్దదే!!

డిసాస్టర్ తర్వాత మూవీ…కస్టడీ టోటల్ బిజినెస్…టార్గెట్ పెద్దదే!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ థాంక్ యు సినిమాతో ఎపిక్ ఫ్లాఫ్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఊహకందని రేంజ్ లో నిరాశ పరిచిన ఆ సినిమా రిజల్ట్ తర్వాత ఒక్కసారిగా నాగ చైతన్య మార్కెట్ మీద ఎదురుదెబ్బ పడగా ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు…

ఇలాంటి టైంలో కోలివుడ్ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు తమిళ్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ ఆడియన్స్ ముందుకు మే 12న రిలీజ్ కానుండగా సినిమా కి ఓవరాల్ గా రీజనబుల్ బిజినెస్ జరిగింది అని చెప్పాలి. కానీ బజ్ అంతగా లేక పోవడంతో మౌత్ టాక్ నే సినిమా ఎక్కువగా నమ్ముకుంది.

ఒకసారి సినిమా టోటల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
👉Nizam – 7.50Cr
👉Ceeded – 2.20Cr
👉Andhra – 8.50Cr
AP TG:- 18.20Cr
👉Ka+ROI – 1.2Cr
👉OS – 2.4Cr
Total WW:- 21.80Cr 
సినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ టార్గెట్ ను అందుకోవాలి అంటే మినిమమ్ 22.50 కోట్ల షేర్ ని…

బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా తమిళ్ వర్షన్ వాల్యూ బిజినెస్ రేంజ్ 2.5 కోట్ల నుండి 3 కోట్ల దాకా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా… దాంతో తమిళ్ లో సినిమా 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here