యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నా మార్కెట్ పరంగా పెద్దగా ఇంప్రూవ్ మెంట్ ని ఏమి సొంతం చేసుకోలేదు. మంచి క్రేజ్ సొంతం అవుతున్న టైంలో థాంక్ యు సినిమాతో ఎపిక్ ఫ్లాఫ్ ను తన ఖాతాలో వేసుకోవడంతో తిరిగి ఇప్పుడు నాగ చైతన్య మార్కెట్ పై ఆ ఇంపాక్ట్ గట్టిగానే పడగా…
తన లేటెస్ట్ మూవీ కస్టడీ మూవీ బిజినెస్ పరంగా థాంక్ యు కన్నా కూడా తక్కువ బిజినెస్ నే సొంతం చేసుకుంది ఇప్పుడు…. ఓవరాల్ గా 21.80 కోట్ల బిజినెస్ ను అందుకున్న సినిమా నాగ చైతన్య రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే కొంచం తక్కువే బిజినెస్ ను సాధించింది.
ఒకసారి రీసెంట్ టైంలో నాగ చైతన్య సోలో హీరోగా చేసిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉#Custody – 21.80CR*******
👉#ThankYou – 24CR
👉#LOVESTORY – 31.20CR
👉#Majili – 21.14CR
👉#SavyaSachi – 23CR
👉#ShailajaReddyAlludu – 24CR
ఇవీ రీసెంట్ టైంలో నాగ చైతన్య నటించిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు…
లవ్ స్టొరీతో కెరీర్ బిగ్గెస్ట్ బిజినెస్ ను అందుకున్న తర్వాత ఇంకా గ్రోత్ ని సొంతం చేసుకోవాల్సి ఉన్నా కూడా తన తర్వాత సినిమాల బిజినెస్ లు తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి టైంలో కస్టడీ సినిమాతో ఇప్పుడు నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.