Home న్యూస్ 18 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న నితిన్…టాప్ 7 తో ఫ్యాన్స్ రచ్చ!!

18 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న నితిన్…టాప్ 7 తో ఫ్యాన్స్ రచ్చ!!

0

యూత్ స్టార్ నితిన్ టాలీవుడ్ లో అడుగు పెట్టి 18 ఏళ్ళు పూర్తీ అయింది, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం సినిమా తో అడుగు పెట్టిన నితిన్ మొదటి సినిమా తోనే అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది జయం సినిమా. ఇక ఈ సినిమా తర్వాత చేసిన…

దిల్ సినిమా తో కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని దక్కించుకుని ఇక వెనుతిరిగి చూసుకోకుండా దూసుకు పోయిన నితిన్ కి మధ్యలో కొన్నేళ్ళు వరుస పెట్టి ఫ్లాఫ్స్ రాగా మార్కెట్ మొత్తం కోల్పోయిన టైం లో మళ్ళీ ఇష్క్, గుండెజారి గల్లంతైందే, చిన్నదానా నీ కోసం, హార్ట్ అటాక్ సినిమాలతో…

మళ్ళీ లైం లైట్ లోకి వచ్చాడు…. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అ ఆ సినిమా తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టగా తర్వాత మళ్ళీ ఫ్లాఫ్స్ ఎదురు అయిన టైం లో రీసెంట్ గా భీష్మ బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ సాలిడ్ గా ఇచ్చాడు. సోషల్ మీడియా లో నితిన్ 18 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా ఫ్యాన్స్…

ట్రెండ్ చేయడం మొదలు పెట్టగా 24 గంటలో 1 లక్షా 51 వేల ట్వీట్స్ ని నమోదు చేసి హీరోల యానివర్సరీ ట్రెండ్స్ లో టాప్ 7 ప్లేస్ ని దక్కించుకున్నారు… ఒకసారి టాప్ ట్రెండ్స్ ని గమనిస్తే
#17VictoriousYrsOfAlluArjun- 1.7M
#39YearsForTriumphSSMBinTFI- 590K
#19YrsOfSovereignNTR- 575K
#18YrsOfTorchBearerNTR- 422K
#12GloriousYearsOfRAMCHARAN- 258K
#21YearsOfPawankalyan- 200k
#18YearsForNITHIINinTFI- 151K*
#15MemorableYrsOfAlluArjun- 135k

ట్రెండ్ మధ్యలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇక లేరు అని తెలియడం తో ట్రెండ్ ఆగిపోయినా ఓవరాల్ గా టాప్ 7 ట్రెండ్ తో దుమ్ము లేపారు నితిన్ ఫ్యాన్స్, భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు నితిన్ రంగ్ దే సినిమా చేస్తుండగా తర్వాత అందాదూన్ రీమేక్ తర్వాత ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here