Home న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డ్ బ్రేక్ చేసిన విజయ్ ఫ్యాన్స్!!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డ్ బ్రేక్ చేసిన విజయ్ ఫ్యాన్స్!!

775
0

సోషల్ మీడియా లో ఒక హీరో ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డ్ ను మరో హీరో ఫ్యాన్స్ బ్రేక్ చేయడం అన్నది సర్వసాధారణంగా మారింది ఇప్పుడు, రీసెంట్ టైం లో మన హీరోల ఫ్యాన్స్ మిగిలిన హీరోల ఫ్యాన్స్ రికార్డులతో పాటు మిగిలిన ఇండస్ట్రీ ల ఫ్యాన్స్ రికార్డులు కూడా బ్రేక్ చేస్తూ దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే, కానీ ఇప్పుడు కోలివుడ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ టాలీవుడ్ రికార్డ్ ను బ్రేక్ చేశారు.

రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నెలకొల్పిన రికార్డులలో ఒకటి ఇప్పుడు బ్రేక్ అయింది. హీరోల పుట్టిన రోజు సమయం లో రిలీజ్ చేసే కామన్ డిస్ప్లే ట్రెండ్(CDP Trend) ఎన్టీఆర్ ఫ్యాన్స్ దుమ్ము లేపే రేంజ్ లో పాత రికార్డులు బ్రేక్ చేశారు.

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ పుట్టిన రోజు సమయం లో రిలీజ్ చేసిన CDP Trend లో 4.6 మిలియన్ ట్వీట్స్ పడగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి 5.2 మిలియన్ ట్వీట్స్ వేశారు. ఇక ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి 6 మిలియన్ ట్వీట్స్ తో దుమ్ము దులిపారు.

ఒకసారి టాప్ ట్రెండ్స్ ని ఒకసారి గమనిస్తే
1.#THALAPATHYBdayFestCDP(20)- 6M**
2.#NTRBirthdayCDP(20)- 5.2M~
3.#ThalaAjithBdayGalaCDP(20)- 4.6M
4.#SultanNTRBdayMonthCDP(20)- 2.7M
5.#PawanKalyanBirthdayCDP(19)- 2.2M
6.#SuriyaBdayFestin50Days(20)- 2.2M
7.#SuperstarMaheshBdayCDP(19)-2M
విజయ్ ఫ్యాన్స్ కొన్ని గంటలు మిగిలి ఉండగానే ఈ రికార్డ్ ను బ్రేక్ చేయగా సడెన్ గా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇక లేరు అన్న వార్తా రావడం తో….

#THALAPATHYBdayFestCDP Breaks NTR Fans Record

ఈ సమయంలో ఇక ట్రెండ్ చేయడం సమంజసం కాదని ట్రెండ్ ఆపేశారు విజయ్ ఫ్యాన్స్, అయినా కానీ మంచి లీడ్ తో 6 మిలియన్ ట్వీట్స్ ని అందుకుని సరికొత్త రికార్డ్ ను నమోదు చేశారు. ఇక త్వరలో విజయ్ పుట్టిన రోజు టైం లో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ కి సిద్ధం అవుతున్నారు విజయ్ ఫ్యాన్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here