బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో సాయి ధరం తేజ్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం అయ్యేలా చేసిన సినిమా విరూపాక్ష. సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును నెల రోజులకు పైగా కొనసాగించగా అన్ని చోట్లా ఆల్ మోస్ట్ 30 రోజులకు పైగానే రన్ ని కొనసాగించి షేర్ ని దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును ఏరియాల వారిగా పూర్తీ చేసుకుంటున్న సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ వసూళ్ళని సాధించింది. ఇప్పుడు నైజాంలో ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమాను నైజాంలో 7 కోట్ల రేంజ్ రేటుకి…
అమ్మగా సినిమా టోటల్ రన్ లో ఇక్కడ ఊహకందని వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా టోటల్ రన్ లో 16.40 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పటికీ కొన్ని చోట్ల రన్ అవుతుంది సినిమా… ఆల్ మోస్ట్ బిజినెస్ మీద సినిమా…
నైజాంలో ఇప్పటి వరకు 9.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. అంటే పెట్టిన రేటు మీద డబుల్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని నైజాంలో ఊచకోత కోసింది. మిగిలిన ఏరియాలలో కూడా కుమ్మేసినా కూడా నైజాంలో సినిమా నెక్స్ట్ లెవల్ లో రాంపేజ్ ని చూపించి దుమ్ము లేపింది.