బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా సంక్రాంతికి వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఎపిక్ లాంగ్ రన్ తో దుమ్ము లేపుతూ ఫైనల్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించడానికి సిద్ధం అవుతూ ఉండగా…
సినిమా రెండు వారాల్లో ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ తో టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…టాలీవుడ్ సీనియర్ హీరోలలో తెలుగు వర్షన్ కి గాను ఆల్ టైం హైయెస్ట్ షేర్ అండ్ గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…
సంచలన రికార్డ్ ను ఇప్పుడు విక్టరీ వెంకటేష్ పేరిట సొంతం అయ్యేలా చేసింది….టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ళ క్రితం చేసిన వాల్తేరు వీరయ్య సినిమా టోటల్ రన్ లో 135.8 కోట్ల షేర్ ని అలాగే 231 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు…
ఓవరాల్ గా అన్ని వర్షన్ లు కలిపి చూస్తె మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా 143.8 కోట్ల షేర్ ని అందుకోగా గ్రాస్ పరంగా 236.40 కోట్ల గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది…గ్రాస్ పరంగా ఆల్ రెడీ ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను కొట్టేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా…
షేర్ పరంగా 2 వారాల్లో ఆల్ మోస్ట్ 141 కోట్ల లోపు షేర్ ని అటూ ఇటూగా అందుకోగా మరో ఒకటి రెండు రోజుల్లో సైరా నరసింహా రెడ్డిని కూడా క్రాస్ చేసి తెలుగు వర్షన్ లాంటి గ్యాప్ లు లేకుండా ఓవరాల్ గా సీనియర్స్ లోనే ఆల్ టైం నంబర్ 1 రికార్డ్ ను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది…
సీనియర్స్ లో సరైన బాక్స్ ఆఫీస్ రికార్డులు చాలా కాలంగా లేని విక్టరీ వెంకటేష్ ఈ సారి సంక్రాంతికి ఊహకందని రికార్డులతో అన్ని రికార్డుల బెండు తీస్తూ మాస్ రచ్చ చేయగా లాంగ్ రన్ లో ఈ సినిమాతో మరిన్ని బిగ్ బెంచ్ మార్క్ లను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.