విజయ్ దేవరకొండ మెహ్రీన్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ నోటా నేడు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున వచ్చేసింది…గీత గోవిందం హిస్టారికల్ విజయం తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయి…మరి అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ…
కథ: ఒక స్వామీజీతో కలిసి కోట్లు కోట్లు వెనక్కి వేసుకున్న కరప్ట్ సిఎం అయిన నాజర్ అనుకోకుండా జైలు కి వెళ్లాల్సి వస్తుంది…అలాంటి సమయంలో తన సిఎం పోస్ట్ తన కొడుకుకి ఇవ్వాలని చెప్తాడు…ఆ కొడుకే హీరో…ఎలాంటి రాజకీయ అనుభవం లేని హీరో ఎలా ప్రస్తుత పరిస్థితులను ఎదురుకున్నాడు అన్నది కథ.
పెర్ఫార్మెన్స్: విజయ్ దేవరకొండ తన పాత్ర వరకు అద్బుతంగా నటించి మెప్పించి సినిమా మొత్తాన్ని తన భుజాన మోశాడు. ఇక మెహ్రీన్ ది సినిమాలో గెస్ట్ రోల్…అప్పుడప్పుడు అలా వస్తూ పోతూ ఉంటుంది…ఉన్నంతలో నాజర్ మరియు సత్యరాజ్ ల పాత్రలు బాగున్నాయి…మిగిలిన పాత్రలకు పెద్దగా నటించే స్కోప్ లేదు.
సంగీతం: సంగీతం పెద్దగా ఆకట్టొలేదు…కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది…
సాంకేతిక వర్గం: ఎడిటింగ్ మరింతగా చేసి ఉండ వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైలాగ్స్ ఒకే అనిపించే విధంగా ఉన్నాయి.
విశ్లేషణ: ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగున్నా దానికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకుంటేనే ఎలాంటి సినిమా అయినా హిట్ అయ్యేది…కథ బలంగా లేకున్నా స్క్రీన్ ప్లే బాగున్న సినిమాలు హిట్ అవుతాయి కానీ కథ ఉంది స్క్రీన్ ప్లే బాలేక పోతే ఎంత పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల మెప్పు పొందలేదు.
నోటా సినిమా రెండో కోవలోకి వచ్చే సినిమానే….పాయింట్ బాగున్నా దర్శకుడు ఆనంద్ శంకర్ స్క్రీన్ ప్లే విషయంలో ఫెయిల్ అయ్యాడు…విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాను సేఫ్ చేసినా దానికి తగ్గ స్క్రీన్ ప్లే లేదు…సేమ్ పోలిటికల్ నేపధ్యంలో వచ్చిన భరత్ అనే నేను సినిమానే చూసుకున్నా అందులో స్క్రీన్ ప్లే తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఫ్యామిలీ సీన్స్, యాక్షన్ సీన్స్ ఉండటం వలన దానికి స్టార్ పవర్ హెల్ప్ అయ్యి సినిమా హిట్ అయింది.
కానీ నోటా లో స్టార్ పవర్ ఉన్నా మిగిలినవి లేకపోవడం వలన అంచనాలను అందుకోలేకపోయింది నోటా సినిమా…దానికి తోడు తమిళ్ ఫ్లెవర్ ఎక్కువగా ఉండటం కూడా బెడసికొట్టింది…మొత్తం మీద నోటా పాయింట్ బాగున్నా అది సరిగ్గా ప్రేక్షకులకు కన్వే కాలేదు.
T2B Live రేటింగ్ 2.5/5 స్టార్స్….