Home గాసిప్స్ ఎన్టీఆర్-డ్రాగన్…ఫ్యాన్స్ కి పూనకాలే ఇక!

ఎన్టీఆర్-డ్రాగన్…ఫ్యాన్స్ కి పూనకాలే ఇక!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) బాక్స్ ఆఫీస్ దగ్గర అరవింద సమేత(Aravindha Sametha) సినిమా తర్వాత సోలో హీరోగా కొత్త సినిమాకి ఆల్ మోస్ట్ 6 ఏళ్ల టైం పట్టగా ఇప్పుడు దేవర(Devara Part 1) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తర్వాత హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి చేస్తున్న….వార్2(War2 Movie)…

చేస్తూ ఉండగా ఆ సినిమా కన్నా ముందు కమిట్ అయిన ప్రశాంత్ నీల్(Prashanth Neel) మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేకుండా పోయింది. మధ్యలో ప్రశాంత్ నీల్ ప్రభాస్(Prabhas) తో సలార్2(Salaar2 Movie) తో చేస్తాడన్న టాక్ ఉండగా ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ పై అప్ డేట్ రావాల్సి ఉంది…

కానీ వీళ్ళ క్రేజీ కాంబోలో మూవీ త్వరలోనే మొదలు కాబోతూ ఉండగా ఈ సినిమా టైటిల్ ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ కాబోతుందని టాక్ గట్టిగా వినిపిస్తూ ఉండగా సినిమా టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది….సినిమాకి క్రేజీ టైటిల్ నే పెట్టారు మేకర్స్…..

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ల కాంబోలో రూపొందబోతున్న సినిమాకి డ్రాగన్(JR NTR DRAGON Movie) అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టినట్లు టాక్ వస్తుంది…ఈ టైటిల్ హక్కులు బాలీవుడ్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ దగ్గర ఉండగా….మేకర్స్ టైటిల్ ను కరణ్ జోహార్ దగ్గర నుండి తీసుకుని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల…

కాంబోలో వస్తున్న సినిమాకి పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ పవర్ ఫుల్ టైటిల్ కనుక నిజం అయితే సినిమా మీద క్రేజ్ టైటిల్ నుండే మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా గురించిన మరిన్ని అప్ డేట్స్ ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజున రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. మరి ఈ టైటిల్ నే కన్ఫాం చేస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here