నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఒక్క ఏరియా లో మాత్రం కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ కానీ లాంగ్ రన్ కానీ అన్ని సినిమాలకు ఎక్కువగా ఉండే ఏరియా ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా రాయలసీమ ఏరియా అనే చెప్పాలి. సింహా, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా లాంటి సినిమాలు అక్కడ అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకున్నాయి.
ఇక స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆదరంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ అంచనాలను తప్పగా ఇప్పుడు ఆ లాస్ లను కవర్ చేయడానికి రెండో పార్ట్ ని భారీ గా రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే…
ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా అంచనాలను పూర్తిగా తప్పగా… రెండో రోజు మాత్రం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా అత్యల్ప కలెక్షన్స్ ని అందుకుని షాక్ ఇచ్చింది, కానీ ఇక్కడ మరో షాక్ కూడా సినిమా కి తగిలింది, అది కూడా బాలయ్య కంచు కోట అయిన సీడెడ్ ఏరియా లో.
సినిమా రెండో రోజు సగానికి పైగా థియేటర్స్ లో డెఫిసిట్ లు పడ్డాయని సమాచారం, Sri Kalahasthi Town : 9K Deficit Nagari : 5k Deficit Chittoor Town : 4k Deficit Puttur : 2k Deficit Renigunta : 5k Deficit.. డెఫిసిట్ అంటే కనీసం థియేటర్ రెంట్లు మరియు….
మెయిన్ టైనెన్స్ లు కూడా రాకపోతే వాటిని డెఫిసిట్ లు అంటారు. ప్రస్తుతం ఒక్క సీడెడ్ లోనే ఇన్ని ఏరియాల్లో డెఫిసిట్ లు పడగా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో డెఫిసిట్ లు పడ్డాయని అంటున్నారు. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.